చాక్లెట్ ఆశ చూపి...చిన్నారిపై అత్యాచారం

11 Feb, 2015 11:45 IST|Sakshi
చాక్లెట్ ఆశ చూపి...చిన్నారిపై అత్యాచారం

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో దారుణం జరిగింది.  ఏడేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన గిడుగు రాజు(45) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాలు.... విజయనగరం జిల్లా తెర్లాం మండలానికి చెందిన ఓ కుటుంబం మండలంలోని నగరం గ్రామంలో ఇటుక బట్టీల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. వారి కూమార్తె స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది.

స్కూల్ పక్కనే నివాసముండే గిడుగు రాజు అనే వ్యక్తి బాలికకు  చాక్లెట్ల ఆశ చూపి వారం రోజులుగా ఈ దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బుధవారం నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
(మామిడికుదురు)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా