మైనర్‌ కాదు.. మోనార్క్‌!

4 Aug, 2019 09:46 IST|Sakshi
 వాహనం నడిపిన మైనర్, అతని తండ్రికి అవగాహన కల్పిస్తున్న పోలీసులు  

సాక్షి,  శ్రీకాకుళం : నగరంలో గత రెండేళ్లుగా వాహనాలు రయ్‌ మంటూ దూసుకుపోతున్నాయి. పలు ద్విచక్ర వాహన ఉత్పత్తిదారులు యువతను ఆకట్టుకునేలా వాహనాలను రూపొందిస్తుండటంతో వీరి వేగానికి అదుపు లేకుండా పోతోంది. తల్లిదండ్రులు కూడా ఏమాత్రం ఆలోచించకుండా తమ పిల్లలకు వాహనాలు కొనుగోలు చేయడమో, ఉన్న వాహనాలను పిల్లలకు ఇవ్వడమో చేస్తున్నారు. పోలీసులు ఎన్నో హెచ్చరికలు చేస్తున్నా యువత, తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం వాహనాలు నడుపుతున్న యువతలో 80 శాతం మందికి లైసెన్స్‌లే లేవనడంలో అతిశయోక్తి కాదు. లైసెన్స్‌లు ఉన్నా వాహనాలకు ఇన్సూరెన్స్‌ లేకపోవడమో, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకపోవడమో జరుగుతున్నాయి. మరోవైపు మైనర్లు వాహనాలు నడుపుతుండడం వల్ల వారికో.. ఎదురుగా వస్తున్న వారికో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

అయినప్పటికీ మైనర్లలో, తల్లిదండ్రుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. నిబంధనలకు అనుగుణంగా రోడ్లు ఎక్కాల్సిన వాహనాలు అందుకు విరుద్ధంగా తిరుగుతున్నాయి. ఇలా నిబంధనలు అతిక్రమించి, పోలీసులకు చిక్కినపుడు సిఫార్సుల ద్వారానో, జరిమానా చెల్లించో వాటి నుంచి బయటపడి మళ్లీ రోడ్లపై యథేచ్చగా తిరుగుతున్నారు. పోలీసులు కూడా ఇటువంటి వారికి జరిమానా విధిస్తున్నారే తప్ప, ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం లేదు. ఇటువంటి సున్నితమైన సమస్యలపై మైనర్లు, తల్లిదండ్రులను చైతన్య పరచాలని ట్రాఫిక్‌ పోలీసులు నిర్ణయించారు. ఇటీవలే వారికి తరచూ కౌన్సిలింగ్‌ నిర్వహించి విడిచి పెడుతున్నారు. అయినా మార్పు రావడం లేదు. శ్రీకాకుళం నగరంలో పలు రోడ్లు ఇరుకుగా ఉండడం అందరికీ తెలిసింది. ఇటువంటి ప్రాంతాల్లో మైనర్లు అతి వేగాన్ని ప్రదర్శించి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ఇటువంటి వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని పట్టణవాసులు కోరుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సొల్లు కబుర్లు ఆపండయ్యా..!

చారిత్రాత్మక నిర్ణయాలతో.. రాష్ట్రం ప్రగతి పథంలో..

బ్యాంకులకు వరుస సెలవులు

వలంటీర్ల చేతుల్లోకి నియామక పత్రాలు

రెవెన్యూ అధికారులు కళ్లు తెరిచారు

పండితపుత్రా.. వాస్తవాలు తెలుసుకో!

వాల్తేరు డివిజన్‌ను చేజారనివ్వం

లైంగిక వేధింపులపై సర్కారు సమరం

ఆదరణ నిధులు పక్కదారి 

మండలాల వారీగా ఆస్పత్రులకు మ్యాపింగ్‌

అవినీతి వల్లే టెండర్లు రద్దు 

పారదర్శకం.. శరవేగం..

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

ఉగ్ర గోదారి..

పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది : ఏపీ డీజీపీ

విద్యార్థుల కోసం 3 బస్సులు

ఈనాటి ముఖ్యాంశాలు

గోదావరి వరద ఉధృతిపై సీఎం జగన్‌ ఆరా

కాటేస్తే.. వెంటనే తీసుకు రండి

గ్రామ వాలెంటరీ వ్యవస్థలో అవినీతికి తావు లేదు

గోదావరికి పెరిగిన వరద ఉధృతి

‘అధికారం పోయినా బలుపు తగ్గలేదు’

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే లోకల్‌ అభ్యర్థిత్వం

ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన

పోలవరం వద్ద గోదావరి ఉదృతి

పోలవరం పూర్తి చేసి తీరతాం

‘గిరిజన విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించండి’

‘బాబు, ఉమకు ఉలుకెందుకు..’ 

టీడీపీ నేత యరపతినేనిపై కేసు నమోదు

శారదాపీఠం సేవలు అభినందనీయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌

సింగిల్‌ టేక్‌లో చేయలేను..!

రష్మిక కోరికేంటో తెలుసా?

ఆర్టిస్ట్‌ బ్రావో!

యాక్షన్‌ అవార్డ్స్‌

శత్రువు లేని యుద్ధం