ముందస్తు ఎన్నికలు రావు: మంత్రి లోకేశ్‌

27 Apr, 2017 01:05 IST|Sakshi
ముందస్తు ఎన్నికలు రావు: మంత్రి లోకేశ్‌

సాక్షి, అమరావతి: దేశంలో ఏకకాలంలో ఎన్నికలు సాధ్యం కావని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి లోకేశ్‌ చెప్పారు. ఏడాది ముందు ఎన్నికలంటే ఏ రాష్ట్రం ఒప్పుకోదని, ఆరు నెలల ముందంటే ఒప్పుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కూడా లేదని చెప్పారు. బుధవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పుడూ చెప్పలేదన్నారు.

ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని మాత్రమే అన్నారని తెలిపారు. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు జరిగితే తాను బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధమని చెప్పారు. మూడేళ్లలో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేశారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్నారు.

మరిన్ని వార్తలు