పూరి- బెంగళూరు గరీబ్ రథ్‌కు తప్పిన ముప్పు

23 Oct, 2016 01:10 IST|Sakshi
పూరి- బెంగళూరు గరీబ్ రథ్‌కు తప్పిన ముప్పు

- కుంగిపోయిన రైల్వే ట్రాక్
- ఆరు గంటల పాటు రైళ్ల
- రాకపోకలు నిలిపివేత
 
 నంద్యాల/ పాయకరావుపేట: పూరి-బెంగళూరు గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ రైలుకు పెనుముప్పు తప్పింది. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని బొమ్మలసత్రం వద్ద శనివారం రైలు వెళ్లిన వెంటనే ట్రాక్ దిగువనున్న మట్టి జారిపోరుుంది. రైలు వెళ్తున్న సమయంలోనే మట్టి జారిపోరుు ఉంటే పెను ప్రమాదం జరిగేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బొమ్మల సత్రం సమీపంలో కుందూ నది వద్ద రైల్వే వంతెన, కేబుల్ వైర్ల ఏర్పాటు పనులు చేపడుతున్నారు. శనివారం మధ్యాహ్నం గరీబ్ రథ్ వెళ్లిన కొద్ది క్షణాలకే ఆ కదలికలకు ట్రాక్ దిగువన 20 అడుగుల వెడల్పులో మట్టి జారిపోరుుంది. వంతెన పనులు చేపడుతోన్న ఇంజనీరింగ్ సిబ్బంది నంద్యాల రైల్వే స్టేషన్‌కు సమాచారం అందించగా, రైల్వే సిబ్బంది స్టేషన్‌లో ఉన్న తిరుపతి-గుంటూరు-కాచిగూడ రైలును నిలిపేశారు. మరమ్మతుల అనంతరం శనివారం సాయంత్రం నుంచి రైళ్ల రాకపోకలు పునరుద్ధరించారు.

 అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు
 విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం సీతారాంపురం ప్రాంతంలో శనివారం రైల్వే ట్రాక్ పట్టా విరిగిపోవడాన్ని కీమెన్ గుర్తించడంతో అమరావతి ఎక్ప్‌ప్రెస్‌కు ముప్పు తప్పింది. దీంతో ఈ ట్రాక్ మీదుగా వాస్కోడిగామా- హౌరా వెళ్తోన్న అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను 40 నిమిషాల పాటు అధికారులు నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్లింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు