ఓట్ల దొంగలు జైలుకే

17 Feb, 2019 11:59 IST|Sakshi
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ ప్రద్యుమ్న, ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌

పారదర్శకంగా ఓటర్ల జాబితా 90 శాతం ఓటింగే లక్ష్యం

ఎన్నికల సిబ్బందికి కలెక్టర్‌ ప్రద్యుమ్న ఆదేశం

20వ తేదీ వరకు అవగాహన సదస్సులు

సెక్టోరల్, పోలీసు అధికారుల సదస్సులో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రద్యుమ్న

చిత్తూరు కలెక్టరేట్‌: ఎన్నికల విధుల్లో సెక్టోరల్, పోలీస్‌ అధి కారుల విధులు చాలా కీలకమైనవని కలెక్టర్‌ ప్రద్యుమ్న అన్నారు. శనివారం స్థానిక అంబేడ్కర్‌ భవనంలో మదనపల్లె డివిజన్‌ సెక్టోరల్, పోలీస్‌ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పిం చిన ఓటుహక్కును జిల్లాలో ఉన్న ఓటర్లందరూ స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి దేశంలో మొదటి స్థానంలో నిలిచేందుకు ఈ నెల 17 నుం చి 20వ తేదీ వరకు గ్రామ, వార్డు స్థాయిల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఓటర్లందరికీ ఈవీఎం, వీవీప్యాట్‌లపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈవీఎంలపై ఓటర్లకున్న సందేహాలను నివృత్తి చేయనున్నట్లు తెలిపారు. అవగాహన కోసం తీసుకెళ్లే యంత్రాలను కార్యక్రమాలు పూర్తయ్యాక తహసీల్దార్‌ కార్యాలయాల్లో భద్రపరచాలన్నారు. ఎట్టి పరిస్థితులల్లోను ఎన్నికల యంత్రాలను ఇళ్లకు తీసుకెళ్లకూడదని తెలిపారు. ఏ చిన్నతప్పు చేసినా, పక్షపాతంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 473 మంది సెక్టోరల్‌ అధికారులు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి మౌలిక సదుపాయాల ఇబ్బందులుంటే నివేదికలు ఇవ్వాలన్నారు. ఆ ప్రక్రియ ఈ నెల 20 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌  మాట్లాడుతూ త్వరలో జిల్లాలో జరిగే ఎన్నికలను ఉత్తమ ఎన్నికలుగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పోలీసులు ఎక్కడైనా విధులు పట్ల అలసత్వం చూపితే చర్యలు తప్పవని  హెచ్చరించారు. అనంతరం ఓటు చిత్తూరు ఓటు పోస్టర్లను ఆవిష్కరించారు.  ఈ అవగాహన కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ మల్లికార్జున, జెడ్పీ సీఈఓ ఓబులేసు, ఈవీఎం నోడల్‌ అధికారి విద్యాశంకర్, ఎంసీఎంసీ నోడల్‌ అధికారి తిమ్మప్ప, ఈఆర్వో లు కనకనరసారెడ్డి, నాగరాజు, సెక్టోరల్, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు