అక్ర‌మాలకు చెక్‌, వివ‌క్ష‌కు ఫుల్‌స్టాప్ 

12 Oct, 2019 15:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన నిధుల స్వాహాయణం ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రి సహాయ నిధినే స్వాహా చేశారు. ప్రాణం పోయాల్సిన వారే క‌మీష‌న్లు పేరుతో ఆ నిధుల్ని దర్జాగా ప‌చ్చ జేబుల్లో వేసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స కోసం పేదలు పెట్టుకున్న విజ్ఞాపనలను టీడీపీ సర్కార్‌ పట్టించుకోలేదు.  22 వేలకుపైగా ఫైళ్ల‌ను మూల‌న పడేసింది. అంతేకాకుండా సీఎం సహాయ నిధి నుంచి ఇచ్చిన 8700 చెక్కులు బౌన్స్ అయ్యాయి. 

పేద‌ల‌కే  కాకుండా వైద్యం చేసిన ఆసుపత్రులకు 2017 నుంచి వందల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టింది. అయితే త‌మ‌కు కావాల్సిన ఆసుపత్రులకు మాత్రం అడ్డగోలుగా చెల్లింపులు చేసింది. ఎల్వోసీలు, రియంబ‌ర్స్‌మెంట్‌ మంజూరులోనూ  80 శాతం స‌హాయ నిధిని కేవ‌లం కొద్దిమంది పచ్చ ఎమ్మెల్యేలు, వారి అనుకూల ఆస్పత్రులు దోచుకున్నాయి. ఈ  అవినీతిని దందా ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగానే సాగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి పేరుతో వివిధ సంస్థలు, ప్రజల నుండి సేకరించిన విరాళాలు ఏమయ్యాయో దేవునికే ఎరుక. 

అక్ర‌మాలకు చెక్‌, వివ‌క్ష‌కు ఫుల్‌స్టాప్ 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి సహాయనిధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్రమాలకు ఒక్కొక్కటిగా తెరదించుతున్నారు. సమర్ధులైన నిజాయితీపరులైన అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో ప్రతి పైసా పేదవారికి చెందాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలు ప‌క్కాగా అమ‌లు అవుతున్నాయి. గతంలో జ‌రిగిన‌ అక్రమాలను అరికట్టడానికి పాత బ్యాంక్ అకౌంట్ మూసివేసి, కొత్త అకౌంట్‌ని  ప్రారంభించారు. బ్రోకర్ల వ్యవస్థను అరికట్టడానికి నేరుగా రోగుల బంధువులకే ఎల్వోసీలను ఇస్తున్నారు. రోగులు ఇబ్బంది పడకుండా, ఏ రోజు ఎల్వోసీలను అదే రోజు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక దాదాపు 2421 ఎల్వోసీలను, 2749 మెడికల్ రీయంబర్సుమెంట్లు, 21  ఫైనాన్షియల్  అసిస్టెన్స్ కలుపుకొని మొత్తం 5,191 దరఖాస్తులను పరిశీలించారు. దాదాపు 52 కోట్లు మంజూరు చేయడం విశేషం. 

మరిన్ని వార్తలు