ఏపీ సోషల్‌ రిఫార్మర్‌ సీఎం వైఎస్‌‌ జగన్‌

29 Jun, 2020 18:19 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జీవం పోశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎంఎస్‌ఎంఈల ద్వారా10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. సింగిల్‌ విండో విధానాన్ని కూడా సీఎం జగన్‌ తీసుకొచ్చారని తెలిపారు. రీస్టార్ట్ ప్యాకేజీ రూపంలో ఎంఎస్‌ఎంఈలకు మొదటి విడతలో రూ. 450 కోట్లు రెండో విడతలో రూ.512 కోట్లు సీఎం వైఎస్‌ జగన్‌ విడుదల చేశారని చెప్పారు. ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రకటించారని చెప్పారు. (ధ్రువీకరణ పత్రం అందుకున్న మాణిక్య వరప్రసాద్‌)

ఆంధ్రప్రదేశ్‌కు సోషల్‌ రిఫార్మర్ సీఎం జగన్‌ అని అబ్బయ్య చౌదరి కొనియాడారు. ఎల్లో మీడియా కీయా మోటార్స్ తరలిపోతుందని తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు. కీయా మోటార్స్ తమ ప్లాంట్‌ను మరింత విస్తరిస్తామని ప్రకటించిందని గుర్తుచేశారు. సౌత్ ఇండియాకు పారిశ్రామిక ముఖద్వారంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని సీఎం భావిస్తున్నారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజన్ ఉన్న నేత అని అన్నారు. చంద్రబాబు ఎన్ని ఇండస్ట్రీల్ సమ్మిట్‌లు పెట్టినా రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రాలేదని ఎద్దేవా చేశారు.చంద్రబాబులా మాయ మాటలు చెప్పడం సీఎం జగన్‌కు తెలియదన్నారు.

ఎంఎస్‌ఎంఈలకు చంద్రబాబు ప్రభుత్వం 4 వేలకోట్లు బకాయిలు పెట్టిందని అబ్బయ్య చౌదరి మండిపడడ్డారు. ఎంఎస్‌ఎంఈలు పెట్టిన వాళ్లలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు అధికంగా ఉన్నారని తెలిపారు. వాటికి మేలు చేసే విధంగా రూ.182 కోట్లు విద్యుత్ బకాయిలు సీఎం వైఎస్‌ జగన్‌ రద్దు చేశారని గుర్తు చేశారు. ఎంఎస్‌ఎంఈల ద్వారా గ్రామ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. త్వరలో 47 సెజ్‌లను ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు