‘స్థానిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించాలి’

6 Mar, 2020 14:01 IST|Sakshi

సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానికి సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ కర్యాకర్తలు కష్టపడి పని చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో తమ ప్రభుత్వం ప్రభంజనం సృష్టించాలని పేర్కొన్నారు.

బాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో!: అనంత

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. 9 నెలల పాలనతో నవరత్నాల అమలు ఎలా ఉందో ప్రచారంలో పేర్కొవాలని సూచించారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలను ధీటుగా ఎదుర్కొవాలని చెప్పారు. అత్యధిక స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ గెలిచి, టీడీపీ జనసేనలకు బుద్ది చెప్పాలని ఆయన అన్నారు. ఇక ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ పరిపాలన అద్భుతంగా ఉందని, ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకేళ్లాలన్నారు. వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఐక్యమత్యంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొవాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా