పాదయాత్రకు వస్తున్న స్పందనను ఓర్వలేకే విమర్శలు

9 Nov, 2017 08:31 IST|Sakshi

ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ 

నెల్లూరు(సెంట్రల్‌): విదేశాల్లో తనకు ఆస్తులున్నాయనే విషయాన్ని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని, లేని పక్షంలో సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేస్తారాననే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించే దమ్ము టీడీపీ నేతలు ఉందా అని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ ప్రశ్నించారు. నగరంలోని 51వ డివిజన్లో గల ఏబీఎం కాంపౌండ్, సుబేదారుపేట ప్రాంతాల్లో ప్రజాదీవెన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్‌ మాట్లాడారు. ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకే టీడీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. 15 రోజుల గడువిచ్చారని, ఆలోపు సవాల్‌ను స్వీకరించి నిరూపించాలని డిమాండ్‌ చేశారు.

 జిల్లాలో ప్రజల వద్దకు వెళ్లి నేరుగా పోటీ చేసి గెలవలేని వారు జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ జిల్లా అ«ధ్యక్షుడు బీద రవిచంద్ర వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. పాదయాత్రను చూస్తున్న టీడీపీ నేతలకు జ్వరం పట్టుకుందని, జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కోసం ప్రత్యేక ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేస్తారని వ్యంగ్యంగా అన్నారు. డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్, నాయకులు బాలాప్రసాద్, అరవ ఆనంద్‌బాబు, కాయల సురేష్‌బాబు, సత్యానందం, ఆంథోనీ బాబు, సంతోషి రమేష్, చిట్టి, సరిత, ప్రమీల, వందవాసి రంగ, సంక్రాంతి కళ్యాణ్, దార్ల వెంకటేశ్వర్లు, పఠాన్‌ ఫయాజ్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు