పైడితల్లి ఉత్సవంలో అశోక్గజపతి రాజుకు అవమానం

22 Oct, 2013 11:23 IST|Sakshi

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే  పి. అశోక్గజపతి రాజుకు సొంత ఇలాకా విజయనగరంలో మంగళవారం అవమానం జరిగింది. సిరిమానోత్సవం సందర్భంగా అశోక్గజపతి రాజు ఈ రోజు ఉదయం పైడితల్లి అమ్మవారిని దర్శించేందుకు దేవాలయానికి చేరుకున్నారు. అయితే ఆయన్ని దేవాలయంలో ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యపై అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. దాంతో ఆమ్మ వారి ఆలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి తన నిరసనను తెలిపారు.



పైడితల్లమ్మవారి తొలేళ్ల ఉత్సవం ఈ రోజు ముగియనున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3.15 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభం కానుంది. అయితే దాదాపు రెండు శతాబ్దాల చరిత్రలో తొలిసారిగా 144 సెక్షన్ అమల్లో ఉండగా సిరిమానోత్సవం జరుగుతోంది. అయితే విజయనగరంలో పోలీసు ఆంక్షల నేపథ్యంలో గతేడాది కంటే సిరిమానోత్సవానికి హాజరయ్యే భక్తులు సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.   
 

>
మరిన్ని వార్తలు