అధికార పంతం.. ప్రతిపక్ష పోరాటం

16 Jun, 2018 12:27 IST|Sakshi
పింఛన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కంబాల జోగులు 

వైఎస్సార్‌సీపీ పోరాటం ముందు ఓడిన అధికార పంతం

సంతకవిటి మండలంలో కొత్త పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

అధికార పార్టీ వైఖరిని నిరసించిన ప్రజలు  

సంతకవిటి శ్రీకాకుళం​ : సంతకవిటి మండల కేంద్రంలో అధి కార పార్టీ తీరుకు నిరసనగా జనం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వీరికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అండగా నిలవడంతో పాటు న్యా యం చేశారు. అర్హులకు అందకుండా ఉండిపోయి న పింఛన్లను వారికి అందించారు. మండలానికి కొత్తగా మంజూరు చేసిన 653 పింఛన్ల పంపిణీని అధికార పార్టీ నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నిం చారు.

అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుతో పాటు పార్టీ రాష్ట్ర యువజన కార్యదర్శి సిరిపురపు జగన్మోహనరా వు, మండల కన్వీనర్‌ గురుగుబెల్లి స్వామి నాయు డు, ఎంపీటీసీ సభ్యులు కనకల సన్యాశినాయుడు, రాగోలు రమేష్‌నాయుడు తదితరులు దీనిపై పో రాడారు. కొత్తగా మంజూరు చేసిన పింఛన్లు ఎలా గైనా నిర్ణీత గడువులోగా ఇవ్వాలని పట్టుబట్టారు.

ఈ నెల 9వ తేదీలోగా వీటిని పంపిణీ చేయాల్సి ఉండగా, అధికారులను అడ్డంపెట్టి జన్మభూమి కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు అడ్డుకోవడం మొదలు పెట్టారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు పార్టీ నేతలు కలుగుజేసుకుని పంపిణీకి పట్టుబట్టారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రజావేదిక నిర్వహించి ఈ పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. కొత్తగా మంజూరైన పింఛన్లను కొందరి ఒత్తిళ్ల మేరకు అధికారులు ముందు ఇవ్వలేదు.

ఎమ్మెల్యే గట్టిగా పట్టుబట్టడంతో పింఛన్ల పంపిణీకి ఒప్పుకున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం అధికార పార్టీకి చెందిన ఎంపీపీ పూడు అక్కమ్మ, వైస్‌ ఎంపీపీ గండ్రేటి కేసరిలు హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు వీరి చేతులమీదుగా కూడా ఫించన్ల పంపిణీని సంతకవిటి ఎంపీడీఓ బి.వెంకటరమణ నిర్వహించారు. పంపిణీ కార్యక్రమం అంతా అయ్యే వరకు జనమంతా ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోనే ఉన్నారు.  

న్యాయ పోరాటం తప్పదు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంబాల జోగులు మా ట్లాడుతూ రాష్ట్రం అంతా టీడీపీ పార్టీ అధికార దు ర్వినియోగానికి పాల్పడుతోందని అన్నారు. సంతకవిటి మండలంలో నీచ రాజకీయాలు, ఆర్థిక నేరాలు అధికమయ్యాయని పేర్కొన్నారు. ఎలాం టి పదవులు లేని వారు కూడా పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు తమకు నచ్చని వ్యక్తులు ఉంటే వారికి సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని విమర్శించారు.

ఇప్పటికీ కొంతమంది అర్హులు ఉండిపోయారని, వీరంతా జన్మభూమి కమిటీల కారణంగా నష్టపోయారని అన్నా రు. వీరికి కూడా న్యాయం జరిగేలా పోరాటాలు చేస్తామని విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.  సుదీర్ఘ అనుభవం అని చెప్పుకుంటున్న సీఎంకు ఎంత మంది దొంగలతో సంబంధాలు ఉన్నాయో జనానికి తెలుస్తుందన్నారు. టీడీపీ వారు రాష్ట్రా న్ని పూర్తిగా ధ్వంసం చేయకమునుపే జనం మేలు కోవాలన్నారు.

కార్యక్రమంలో పార్టీ నాయకులు సర్పంచ్‌లు కెంబూరు సూర్యారావు, మొ య్యి మోహనరావు, ఎన్ని శ్రీనివాసరావు, దవళ సీతమ్మ, వావిలపల్లి రమణారావు, మాజీ ఎంపీటీసీ డోల తిరుపతిరావు,  వావిలపల్లి సమీర్‌నా యు డు, రూపిటి శ్రీరామమూర్తి, పప్పల గణపతి, రూపిటి చిన్నప్పలనాయుడు, రెడ్డి స్వామి నాయు డు, కంచరాపు వెంకటరమణారావు, గురువు సింహాచల, నర్శింహమూర్తి, ఉపసర్పంచ్‌ వి.శ్రీనివాసరావు,  కొప్పల ఉమామహేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ యడ్ల రామకృష్ణ, బగాది వెంకటరమణ, భుజంగరావు, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ గురుగుబెల్లి గవరయ్య, నాయకులు, చిన్నప్పలనాయుడు, బగాది వెంకటరమణ, వావిలపల్లి శ్రీనివాసరావు, పప్పల గణపతి,  యడ్ల రామకృష్ణ, గురువు సింహాచలం తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు