జనగోదావరి ప్రవాహంలా జగన్‌ పాదయాత్ర

18 Apr, 2018 10:52 IST|Sakshi
కృష్ణాజిల్లా జి.కొందూరులో జగన్‌తో పాటు పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే జగ్గిరెడ్డి  

జగన్‌ వెన్నంటే నడిచిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి  

కొత్తపేట: ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర జనప్రభంజనంతో సాగుతోందని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. మంగళవారం కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొందూరు గ్రామంలో జగన్‌ పాదయాత్రలో జగ్గిరెడ్డి ఆయన వెన్నంటే నడిచారు.

జిల్లా, నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను జగ్గిరెడ్డి జననేత జగన్‌కు వివరించారు. అనంతరం ఆయన అక్కడి విశేషాలను ఫోన్‌లో ఇక్కడి విలేకర్లకు వివరించారు.

పాదయాత్ర జనగోదావరి ప్రవాహంలా సాగుతోందన్నారు. భారీ సంఖ్యలో జనం తరలివచ్చి, మద్దతు ఇచ్చి జగన్‌ వెంట నడుస్తున్నారని తెలిపారు. ఆయన వెంట జిల్లా వైఎస్సార్‌ సీపీ సేవాదళ్‌ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, రాజోలు నియోజకవర్గ పార్టీ మాజీ కో ఆర్డినేటర్‌ చింతలపాటి వెంకటరామరాజు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు