కార్మికుల కాళ్లు కడిగిన ఎమ్మెల్యే

6 Apr, 2020 16:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని దరిచేరకుండా చేస్తున్న పోరాటంలో  సైనికులు పారిశుధ్య కార్మికులేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అత్యంత క్లిష్ట సమయంలో కూడా ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారన్నారు. (దేశంలో మూడోదశకు కరోనా వైరస్‌ : ఎయిమ్స్‌)

ఇక కార్మికుల కృషిని, శ్రమను అభినందిస్తూ ఎమ్మెల్యే, జక్కంపూడి గణేష్‌లు కార్మికుల పాదాలను కడిగారు. వారు చేసిన సేవలకు కార్మికులకు ఎంత చేసినా తక్కువే అవుతుందని ప్రశంసించారు. ఇక కార్మికుల కనీసవేతనం రూ. 18 వేలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్మికుల సేవలను గుర్తించి వారికి కనీస వేతనం అందేలా చూస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. భయంకరమైన కరోనా వైరస్ ప్రభలుతున్నప్పటికీ దానిని లెక్కచేయకుండా సేవలందిస్తున్న కార్మికుల పాదాలు కడిగి.. వారివెనక మేమున్నామన్న ధీమా కల్పించామని ఎమ్మెల్యే తెలిపారు. కాగా ఈ సమావేశంలో జక్కంపూడి గణేష్, శివరామ సుబ్రహ్మణ్యం, వాసంశెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. (వైరల్‌ ట్వీట్‌: బిగ్‌బీపై నెటిజన్ల ఫైర్‌)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు