బాబూ..కమిటీలతో పాలన చేసుకో!

23 Feb, 2015 01:10 IST|Sakshi

శ్రీరంగరాజపురం:  సీఎం నారా చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేల వ్యవస్థను తొల గించి కమిటీలతో పాలన చేస్తే బా గుంటుందని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన తయ్యూరులో పల్స్‌పోలియో కార్యక్రమానికి వచ్చారు. ఎంపీడీవో, తహశీల్దార్ హాజరుకాకపోవడంపై మండిపడ్డా రు. పల్స్‌పోలియో కార్యక్రమంలో పాల్గొనకుండానే ప్రజా సమస్యలు విన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాబు పాలన అధ్వానంగా తయారైందన్నారు. వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలను పూర్తిగా విస్మరిస్తున్నారని, అధికారులను నిర్లక్ష్యం చేస్తున్నారని, కేవలం జన్మభూమి కమిటీలతో పాల న సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.

ఇదే పద్ధతి కొనసాగితే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అనంతరం ఆ యన దిగువ ముదికుప్పంలో పెద్దసుబ్బారెడ్డి కర్మక్రియల్లో పాల్గొన్నారు. కొత్తపల్లెమిట్టలో గిరిజమ్మ తండ్రి దొరస్వామిరెడ్డి శనివారం రాత్రి మరణించిన విషయం తెలుసుకుని పూల మాల వేసి, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. ఎంపీపీ మోహన్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఆనందరెడ్డి, జెడ్పీటీసి విజయ్‌కుమార్, తయ్యూరు సర్పంచ్ బాబు, పార్టీ మండలాధ్యక్షుడు అనంతరెడ్డి, నాయకులు కుప్ప య్య, కాళప్ప, ఆంజి, ఏసు, అల్లిముత్తు తదితరులు పాల్గొన్నారు.
 
 
 

మరిన్ని వార్తలు