రైతులకు అండగా భరోసా కేంద్రాలు

5 Jun, 2020 12:31 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి

సాక్షి, పశ్చిమగోదావరి: దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు భరోసా కేంద్రాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. శుక్రవారం దెందులూరు నియోజకవర్గం సత్యనారాయణపురంలో ఎరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతులతో కలిసి దుక్కి దున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరుణ దేవుడు కరుణించడంతో వర్షాలు పుష్కలంగా కురిసి రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. (రాజధాని భూ కుంభకోణం.. సిట్‌ దూకుడు)

పంట వేసే సమయంలో రైతుకు అండగా ఉండేందుకు రైతు భరోసా ద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిందని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో విత్తనాలు,ఎరువుల కోసం రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు,ఎరువులను నేరుగా రైతులకు అందిస్తున్నామన్నారు. సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన పథకాలతో రైతులు ఆనందంగా ఉన్నారని ఆయన తెలిపారు. (తిరుమల శ్రీవారి ఆలయంలో ట్రయల్‌ రన్‌..)

మరిన్ని వార్తలు