కౌన్సిలర్లే అవినీతి పరులు

24 Jun, 2018 10:40 IST|Sakshi

ఎమ్మెల్యే కురుగొండ్ల వివాదాస్పద వ్యాఖ్యలు  
వెంకటగిరి: వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు ఇచ్చిన కమీషన్లు తమ పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లకే అందాయని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. శనివారం ఆయన పట్టణంలోని పాలకేంద్రం సెంటర్‌లో ఎన్టీఆర్‌ సుజల స్రవంతి వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికలు, టీవీ చానళ్లలో తనను అవినీతి పరుడిగా చిత్రిస్తూ వచ్చిన కథనాలపై ఆయన ఘాటుగా స్పందించారు. 

నాలుగేళ్లలో వెంకటగిరిలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని, వీటికి సంబంధించి కాంట్రాక్టర్ల నుంచి తానేమీ తీసుకోలేదన్నా రు. అనంతరం అక్కడే ఉన్న మున్సిపల్‌ కాంట్రాక్టర్‌ సుబ్రహ్మణ్యంనాయుడుతో కమీషన్లు తీసుకున్న వ్యక్తుల పేర్ల చెప్పాలని హుకుం జారీ చేశారు. దీంతో సుబ్రహ్మణ్యంనాయుడు తటపటాయిస్తూ కౌన్సిల ర్లు, చైర్‌పర్సన్‌లకు కమీషన్‌లు ఇచ్చానని వెల్లడించారు. కాగా ఎవరెంత తీసుకున్న విషయాన్ని త్వరలో తేల్చేస్తానని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంతు శారద కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. అయితే అక్కడే ఉన్న మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బీరం రాజేశ్వరరావు, పలువురు కౌన్సిలర్లు మిన్నకుండిపోయారు. 

‘సాక్షి’పై అక్కసు
‘సాక్షి’ టీవీలో గురువారం ప్రసారమైన ఎమ్మెల్యే ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ కథనం, ‘సాక్షి’ దినపత్రికలో నీరు–చెట్టు పథకంలో జరి గిన అవినీతిపై వస్తున్న కథనాలపై ఎమ్మె ల్యే అక్కసు వెళ్లగక్కారు. తప్పు జరిగి ఉంటే తనను ప్రశ్నించాలన్నారు. కార్యక్రమంలో వెంకటగిరి ఏఎంసీ చైర్మన్‌ పులి కొల్లు రాజేశ్వరరావు, మున్సిపల్‌ కమిషనర్‌ సి.గంగాప్రసాద్, కౌన్సిలర్‌ పి.విశ్వనాథ్, ఆవుల ప్రహ్లాద, కె.చెంగారావ్, కె.రమేష్, ఎం.బాబు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు