దిశ ఘటన ఎవరు ఊహించనిది: సుమన్‌

7 Dec, 2019 12:45 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆడపిల్లలకు విద్యతో పాటు ఆత్మరక్షణ శిక్షణ కూడా చాలా అవసరమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విజయవాడలోని ఓ కార్యక్రమంలో ఆయనతో పాటు సినీ నటుడు సుమన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిఒక్కరికి కరాటే ఎంత అవసరమో దిశ ఘటనతో అర్థం అయ్యిందని వాఖ్యానించారు. అనంతరం సుమన్‌ మాట్లాడుతూ.. దిశ ఘటన ఎవరు ఊహించనిది అని,  మహిళలకు ఆత్మ రక్షణ అవసరమని గత ముప్ఫై ఏళ్లుగా ప్రతి కార్యక్రమంలో చెప్పుకొస్తున్నామన్నారు.

వారంలో రెండు రోజులు మహిళలకు ఆత్మరక్షణ క్లాసులు పెట్టాలని,  విద్యార్థినిలకు కూడా 6వ తరగతి నుంచే ఈ క్లాసులను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా పాఠశాలల్లో ఆత్మరక్షణ క్లాసుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ అయిదుగురికి డిప్యూటీ సీఎం పదువులు ఇచ్చారని, అలాగే మహిళలకు ప్రాధాన్యతనిస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్‌ అన్నారు. భారతదేశంలో చట్టాలు బలహీనంగా ఉన్నాయని, చట్టాలను పటిష్ట పరచాలని ఆయన వ్యాఖ్యానించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా