లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి

22 Mar, 2020 20:57 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

సాక్షి, విజయవాడ: ప్రజా శ్రేయస్సు కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కరోనా వైరస్‌ కట్టడికి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలందరూ జనతా కర్ఫ్యూ విజయవంతం చేశారని పేర్కొన్నారు. సాయంత్రం ఐదు గంటలకు పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, పోలీసుల కృషికి చప్పట్లతో అభినందనలు తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు. (తెలుగు రాష్ట్రాల్లో 8 జిల్లాలు లాక్‌డౌన్‌)

కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు రాష్ట్రంలో​ పటిష్ట చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని.. అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావాలని సూచించారు. మార్చి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని కోరారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ నిర్బంధంలో ఉండాలన్నారు. విజయవాడలో  ఐసోలేషన్‌ వార్డులను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే విష్ణు పేర్కొన్నారు.
(ఈ నెలాఖరు వరకు ఏపీ లాక్‌డౌన్‌ : సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు