'చంద్రబాబు చేసిన పనులను చరిత్ర క్షమించదు'

18 May, 2020 18:22 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్ జిల్లా: పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతోనే సీమకు నీటి కష్టాలు పోతాయని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'రాయలసీమ వాసులకు నీటి కష్టాలను పాలద్రోలేలా దివంగత నేత వైఎస్ జలయజ్ఞం ప్రవేశ పెట్టారు. ఆయన హయాంలో తెలంగాణ లో 60 శాతం ప్రాజెక్టులు నిర్మిస్తే 40 శాతం ప్రాజెక్టులు రాయలసీమలో నిర్శించారు. ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో అనేక ప్రాజెక్టులు నిర్మించడం వల్ల మనకు నీటి కష్టాలు ఉన్నాయి. చదవండి: ‘31 వరకు దేవాలయాల్లో దర్శనాలు రద్దు’ 

జాతీయపార్టీలది ద్వంద్వ వైఖరి
రాబోయే రోజుల్లోనూ రాయలసీమకు నీటి కష్టాలు తప్పేలా లేవు. మిగులు జలాల విషయంలోనూ రాయలసీమ వెనుకబడి ఉంది. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన విధంగా 511 టీఎంసీల కన్నా ఎక్కువ నీటిని వాడుకునే అవకాశం లేదు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతోనే రాయలసీమకు నీటి కష్టాలు పోతాయి. రాయలసీమ ప్రజల సమస్య తీర్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జీవో నెంబర్‌ 203ను జారీ చేశారు. దీనిని తెలంగాణలోని కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఇక్కడి కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఆ జీవోని అమలు చేయాలని అంటుంది. ఇలా జాతీయపార్టీలు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాయి.

కేసీఆర్‌ మంచి నిర్ణయం తీసుకోవాలి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఈ విషయమై ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు హయాంలో కమిషన్లకు కక్కుర్తిపడ్డారు తప్ప నీటి సమస్య తీర్చలేదు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకొని చంద్రబాబు అండ్‌ కలెక్షన్స్‌ చేశారు. చంద్రబాబు చేసిన పనులను చరిత్ర క్షమించదు. పార్టీలు ద్వంద రాజకీయాలు మానుకొని రాయలసీమ వాసుల నీటి కష్టాలు పోయేలా ముందుకు రావాలి. తమిళనాడు జల్లికట్టు స్ఫూర్తి మనకెందుకు రావడం లేదు. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న పనులకు ప్రతిపక్ష పార్టీలు స్వాగతించి మద్దతు ఇవ్వాలి. ఈ జీవోను అడ్డుకుంటే భవిష్యత్‌లో ప్రజలు ఉద్యమాలు చేయక తప్పదని' అన్నారు.
చదవండి: బస్‌లు, క్యాబ్‌లకు గ్రీన్‌సిగ్నల్‌ 

మరిన్ని వార్తలు