పారిశ్రామిక రంగానికి పెద్దపీట

21 Sep, 2019 12:36 IST|Sakshi
శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఆర్‌.కె రోజా. చిత్రంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ విప్‌ సామినేని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కె.ఎస్‌. లక్ష్మణరావు, పార్టీనేత బొప్పన తదితరులు

ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్‌.కె.రోజా

ఆటోనగర్‌లో హోసింగ్‌ కార్పొరేషన్‌

భవన సముదాయం ఆరంభం

ఆటోనగర్‌ (విజయవాడ తూర్పు):  రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద పీట వేస్తున్నారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నా రు. విజయవాడలో నిర్మించిన జవహర్‌ ఆటోనగర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ భవన సముదాయాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నిజంగా పరిశ్రమలు పెట్టుకునే వారికి మాత్రమే తమ ప్రభుత్వం భూములు కేటాయిస్తుందని చెప్పారు.

గత ప్రభుత్వం బినామీలకు భూములిచ్చిందని, పారిశ్రామిక వేత్తలకు భూమిని కేటా యించే విషయంలో అనేక అవకతవకలు జరిగా యని వివరించారు. అప్పట్లో ఒకరికి రూ.10 లక్షలకు భూమిని కేటాయిస్తే మరొకరికి రూ.20 లక్షలకు కేటాయించేవారని విమర్శించారు. అందరికీ ఒకే ధరకు భూమి కేటాయించే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రతి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు పెంచుతామని రోజా వివరించారు. ఎన్నో సంవత్సరాల నుంచి  ప్రారంభోత్సవం కోసం  ఎదురు చూస్తున్న కార్మికుల కల నేటికి  నెరవేరిందని, ఈ భవన నిర్మాణం చూస్తుంటే మనం ఆటోనగర్‌ ఉన్నామా లేక అమెరికాలో ఉన్నా మా అన్న ప్రశ్న తలెత్తుతోందన్నారు.  

దేవదాయ  శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన కేవలం వంద రోజుల్లో అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. వచ్చే సంవత్సరం  ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల ఇళ్లను ఇస్తున్నామన్నారు. గత 5 సంత్సరాల్లో చంద్రబాబు మాయమాటలు చెప్పి పేదవారిని అన్ని విధాలనట్టేట ముంచారన్నారు. కార్యక్రమంలో ఉదయభాను, సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బొప్పన భవకుమార్, ఐలా చైర్మన్‌ దుర్గాప్రసాద్, కమిషనర్‌ పి.నాగేశ్వరరావు, యార్లగడ్డ సుబ్బారావు, బత్తుల ప్రసాద్‌రెడి,  కమ్మిలి సత్యన్నారాయణ      పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా