అంబేద్కర్‌ వ్యక్తి కాదు.. శక్తి: ఆర్కే రోజా

14 Apr, 2020 13:44 IST|Sakshi

సాక్షి, నగరి(చిత్తూరు): డాక్టర్‌ బిఆర్‌​ అంబేద్కర్‌ ఏ ఒక్క కులానికి, మతానికీ చెందిన వారు కాదని ఆయన ఓ శక్తి అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. కాగా మంగళవారం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా నగరి, పుత్తూరులోని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లడుతూ.. సమ సమాజ శ్రేయస్సు కోసం పోరాడిన  రాజ్యాంగ నిర్మాత, నిగర్వి, శ్రేయోభిలాషి ఆయన అన్నారు. ఇక కొంతమంది ఆయనను తమ సమూహానికి సంబంధించిన వ్యక్తిగా ఆపాదించడం సబబు కాదన్నారు. (అంబేడ్కర్‌కు సీఎం జగన్‌ ఘన నివాళి)

యావత్ భారతదేశానికి చెందిన వ్యక్తి అంబేద్కర్ అని ఎమ్మెల్యే అన్నారు. పేద, దళితులకు రెండు పురపాలక సంఘం పరిధిలో నిత్యావసర సరుకలతో పాటు మూడు రకాల కూరగాయలను రెండు వేల కుటుంబాలకు పంపిణీ చేశారు. రాష్ట్రంలో చూస్తే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమ సమాజ స్థాపనకోసం అట్టడుగు వర్గాల వారిని పైకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారన్నారు.  సీఎం జగన్‌ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు అన్నింటిలోను 50 శాతం స్థానాన్ని కల్పించారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న సీఎం జగన్‌ క్యాబినెట్‌లో పార్టీలో ఒక ఎమ్మెల్యేగా తాను ఉండటం చాలా గర్వంగా ఉందని రోజా పేర్కొన్నారు. (మరణం లేని మహా శక్తి ఆయన : సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు