‘మాది చేతల ప్రభుత్వం’

1 Oct, 2019 10:10 IST|Sakshi

సాక్షి, గుంతకల్లు(అనంతపురం) : గుంతకల్లులోని జగ్జీవన్‌రామ్‌ కాలనీలో నిర్మించిన మారెమ్మ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ పీడీ రంగయ్య, ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి పాత గుంతకల్లు వాల్మీకి సర్కిల్‌లోని వాల్మీకి విగ్రహానికి పూజ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని వారు చెప్పారు. అనంతరం వాల్మీకులు వివిధ సమస్యలపై ఎంపీ, ఎమ్మెల్యేకి వినతిపత్రం అందించారు.  

డీ.హీరేహాళ్‌: మండల కేంద్రంలోని నీలకంఠేశ్వ కళ్యాణ మంటపంలో సోమవారం వెలుగు ఏసీ గంగాధర్‌ ఆధ్వర్యంలో రూ.4 కోట్ల వడ్డీలేని రుణాలను మహిళలకు ప్రభుత్వవిప్‌ కాపు రామచంద్రారెడ్డి చెక్కుల రూపంలో అందించారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించిన హామీల్లో 80 శాతం వరకు నాలుగు నెలల్లోనే పూర్తి చేశారని, మిగతావి కూడా పూర్తి చేస్తారన్నారు.  

కళ్యాణదుర్గం: పట్టణంలోని ఆర్డీటీ ఏఎఫ్‌ ఫీల్ట్‌ కార్యాలయంలో సోమవారం వెలుగుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  252 మహిళా సంఘాలకు రూ.13 కోట్ల వడ్డీలేని రుణాలు చెక్కులను ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళల పక్షపాతి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తమది మాటల ప్రభుత్వం మాదని చేతల ప్రభుత్వమన్నారు.

మరిన్ని వార్తలు