ఎమ్మెల్యే విష్ణు క్షమాపణ చెప్పాలి

2 Jul, 2016 00:14 IST|Sakshi

 రణస్థలం : ఉపాధి హామీ చట్టం, కిలో రూపాయి బియ్యం పథకాల వల్ల వ్యవసాయ కూలీలు, పేదలు సోమరిపోతులౌతున్నారని, వాటిని సత్వరం ఎత్తివేయాలని అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే, శాసనసభాపక్ష నాయుకుడు విష్ణుకుమార్‌రాజు తక్షణమే క్షమాపణ చెప్పాలని సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్. అమ్మన్నాయుడు శుక్రవారం డిమాండ్ చేశారు.
 
 పేదలు, వ్యవసాయ కూలీలు ఓట్లతో గెలిచి న ప్రజాప్రతినిధులు ఇలా మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. దేశానికి తిండిని అందిస్తున్న వ్యవసాయ కూలీలు, పేదల పట్ల ఇలా అహంకార పూరితంగా మాట్లాడడం తగదని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో 46.43 హెక్టార్ల భూమి సాగులోకి వచ్చిందని గుర్తు చేశారు. ఇటువంటి పథకాన్ని ఎత్తివేయాలని బీజేపీ నాయుకులు చెప్పడం సమంజసం కాదని విమర్శించారు.  
 

>
మరిన్ని వార్తలు