దేశం గుండెల్లో రెబల్

16 Jun, 2015 04:43 IST|Sakshi
దేశం గుండెల్లో రెబల్

ఎంఎల్‌సీ ఎన్నికల్లో ఎదురులేదనుకున్న టీడీపీకి మాజీ ఎమ్మెల్యే ఉప్పల పాటి వెంకట రమణమూర్తిరాజు(కన్నబాబురాజు) షాకిచ్చారు. రెండు స్థానా లకు నామినేషన్లు దాఖలు చేసి టీడీపీగుండెల్లో రె‘బెల్’ మోగించారు. అధిష్టానంతో అమితుమీ తేల్చుకుంటానని కన్నబాబు చేసిన ప్రకటన గుబులు రేపుతోంది.
- రసకందాయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు
- సోమవారం ఐదు నామినేషన్లు
- వేసిన వారంతా టీడీపీకి చెందిన వారే
- ఒకటో స్థానానికి ఎంవీవీఎస్ మూర్తి
- రెండో స్థానానికి చలపతిరావు
- రెండు స్థానాలకు కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం:
ఎంఎల్‌సీ ఎన్నికల్లో సోమవారం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. దాఖలు చేసిన వారంతా టీడీపీకి చెందిన వారే.  గంటా శ్రీనివాసరావు అనుచరుడు కన్న బాబురాజు రెబల్‌గా రెండుస్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఆడారి తులసీరావు డమ్మీగా వేశారని, కందుల స్వతంత్రుడిగా నామినేషన్ దాఖలు చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జే.నివాస్ ప్రకటించారు. రెబల్‌గా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాత్రం రెండు స్థానాలకు చెరొక నామినేషన్ దాఖలు చేశారు. తొలుత ఉదయం ర్యాలీగా బయల్దేరేందుకు అధికార పార్టీ అభ్యర్థి ఎంవీవీఎస్ మూర్తిపార్టీ నేతలను ఆహ్వానించారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మరో అభ్యర్థి పప్పల చలపతి రావు, అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్‌లతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు చేరుకున్నప్పటికీ మంత్రి గంటా మాత్రం రాలేదు.  

చేసేది లేక మూర్తి ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. గంటా మధ్యలో కలిసి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. తర్వాత మూర్తి..పప్పల నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమానికి సగానికి పైగా పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు డుమ్మా కొట్టారు. వీరిని కన్నబాబురాజు ఆపేశారనే ప్రచారం జరిగింది. 24 మంది జెడ్పీటీసీల్లో సగం మంది  హాజరయ్యారు. వంద మంది వరకు ఎంపీటీసీలు గైర్హాజరైనట్టు పార్టీలో శ్రేణులు గుర్తించారు. నాలుగు వాహనాలకు మించి అనుమతించే ప్రసక్తే లేదని ఆర్వో ప్రకటనకు విరుద్ధంగా భారీ కాన్వాయ్‌తో టీడీపీ అభ్యర్థులు కలెక్టరేట్‌లోకి వచ్చారు.పార్టీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి హల్‌చల్ చేశారు.  ఆర్వో ఛాంబర్ లోకి అభ్యర్థితో పాటు ప్రతిపాదించే వ్యక్తులను మాత్రమే అనుమతిస్తామని చెప్పినప్పటికి మంత్రులు,ఎమ్మెల్యేలు,ఇతర పార్టీ నేతలు భారీగానే లోనికి వెళ్లారు. బీజేపీ తరపున ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాత్రం హాజరు కాలేదు.
 
నిరాడంబరంగా కన్నబాబురాజు నామినేషన్
కన్నబాబురాజు నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశారు. బలపర్చిన పదిమంది ఎంపీటీసీ సభ్యులతో పాటు ఇతర ముఖ్య అనుచరులు వెంటరాగా మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థుల నామినేషన్ సమయంలోనే కన్నబాబురాజు నామినేషన్ వేస్తున్నారంటూ పార్టీ శ్రేణుల్లో కలకలం మొదలైంది. కన్నబాబురాజు మీడియాకు ఫోన్ చేసి తాను రెండు స్థానాలకు నామినేషన్ వేస్తున్నట్టుగా సమాచారమిచ్చి మరీ నామినేషన్ దాఖలు చేశారు.

రెండూ మావే:గంటా, అయ్యన్న
రెండు స్థానాలను అవలీలగా గెలుచుకుంటామని మంత్రులు గంటా శ్రీనివాస రావు, అయ్యన్న పాత్రుడులు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థులుగా పప్పల చలపతిరావు, ఎంవీవీఎస్ మూర్తి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, ఎన్నికల సమయంలో ఇలాంటి అసంతృప్తులు సహజమేనన్నారు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని సామాజిక వర్గాల సమతూకం పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారే తప్ప జిల్లాలో బీసీలు, ఎస్టీలకు అన్యాయం చేశారనడం సరి కాదన్నారు. కన్నబాబురాజు బరిలోకి దిగుతుండడంపై మంత్రి గంటా స్పందిస్తూ ఎమ్మెల్సీ సీటుఆశించారని..రాకపోయేసరికి అసంతృప్తికి గురై ఈ నిర్ణయం తీసుకున్నారని.. తాను ఉదయమే ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాననిచెప్పా రు. పరిణామాలను చంద్రబాబు, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. 19వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉన్నందున కన్నబాబురాజుతో ఉపసంహరణకు ఒప్పిస్తామన్నారు.
 
నేడు మరో రెబల్ నామినేషన్

టీడీపీలో రెబల్స్ బెడద మరింత ఎక్కువయ్యే లా కన్పిస్తోంది. మంగళవారం మరో టీడీపీ రెబల్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రూరల్ పార్టీ మాజీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు నామినేషన్ వేయనున్నట్టు తెలిసిం ది. ఈయన్ని బుజ్జగించేందుకు మంత్రి అయ్య న్న పాత్రుడు ప్రయ త్నిస్తున్నట్టు తెలిసింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు