నేటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

9 Jun, 2015 01:12 IST|Sakshi

విజయనగరం కంటోన్మెంట్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం  విడుదల చేస్తున్నట్టు   కలెక్టర్ ఎంఎం నాయక్ తెలిపారు. పోలింగ్ నిర్వహణకు విజయనగరం ఆర్డీఓ కార్యాలయం, పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయాలను గుర్తించామన్నారు. నామినేషన్లు జూన్ 9 నుంచి 16 వరకూ ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంటల వరకూ స్వీకరిస్తారని తెలిపారు. ప్రభుత్వ సెలవు దినాల్లో మినహాయింపు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. జూన్ 17 న నామినేషన్ల స్క్రూట్నీ చేస్తామన్నారు. 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవచ్చు.
 
  జూలై3 వతేదీ ఉదయం 8నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. ఏడవ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.  10వ తేదీ నాటికి ఎన్నికల విధులు పూర్తవుతాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పురుష ఓటర్లు 272 మంది, మహిళలు 447 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు  మొత్తం 719 మంది ఓటు హక్కును వినియోగించేందుకు అవకాశముంది. విజయనగరండివిజన్‌లో 379, పార్వతీపురం డివిజన్‌లో 340 ఓటర్లున్నారు.
 
  ఈ ఎన్నికలకు జాయింట్ కలెక్టర్ బి రామారావు రిటర్నింగ్ అధికారిగా, జిల్లా రెవెన్యూ అధికారి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు.   జూలై 10 వరకూ ఎన్నికల నియమావళి అమలులో ఉంటుంది. ఎన్నికల కోడ్ అమలు చేసే బాధ్యతను జెడ్పీ సీఈఓకు అప్పగించారు.    డివిజన్ పరిధిలో ఆర్డీఓలు, మండలాల్లో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు ఎన్నికల కోడ్  సరిగా అమలయ్యేలా పర్యవేక్షిస్తారని తెలిపారు.   ప్రతీ మండలానికి ఎన్నికల కోడ్ అమలు అధికారులుగా ఎంపీడీఓలను నియమించామని కలెక్టర్ తెలిపారు.
 
 నిబంధనలు...
 2ఈ ఫారం నింపి నామినేషన్ దాఖలు చేయాలి.  
 అభ్యర్థిని కనీసం పది మంది ప్రతిపాదించాలి
 అభ్యర్థి ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలన్నారు.
 ప్రతిపాదించినవారు విజయనగరం లోకల్ అధారిటీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి
 నామినేషన్ల పేపర్లు స్వయంగా గానీ, ప్రతిపాదకుని ద్వారా గానీ నిర్దేశిత స్థలం, సమయానికి దాఖలు చేయాలి.
 
 ఒక అభ్యర్థి నాలుగు నామినేషన్ల సెట్‌లు దాఖలు చేయవచ్చు  
 మొదటి సెట్ నామినేషన్లతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి
 నామినేషన్ వేసే అభ్యర్థి తన రెండుఁరెండున్నర  సెంటీమీటర్ల సైజు ఉన్న కలర్ లేదా బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఇవ్వాలి
 

మరిన్ని వార్తలు