‘అపోలోకు ఎందుకు అప్పగించారు?’

20 Mar, 2016 05:18 IST|Sakshi
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో  వైద్య ఆరోగ్య ప్రైవేటీకరణ మొదలైందని శాసనమండలిలో పలువురు ప్రతిపక్ష ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. ‘వైద్యం, ఆరోగ్యం- రాష్ట్ర ప్రభుత్వ విధానం’ అంశంపై శుక్రవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. చర్చను ప్రారంభించిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ.. చిత్తూరులోని ప్రభుత్వాసుపత్రిని అపోలో సంస్థకు అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
 
ఒక మెడికల్ కాలేజీకి అనుమతి తెచ్చుకొని దానిని నిర్వహించుకోని పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. ప్రభుత్వాసుపత్రుల నుంచి ప్రజలకు అందుతున్న సేవలు బాగా లేని మాట వాస్తవమని.. అయితే, ఇప్పుడు దానికి బదులుగా దీర్ఘకాలంలో మరింత నష్టం చేకూర్చే పీపీపీ పద్దతి వైపు ప్రయత్నాలు చేయటం సరికాదని గేయానంద్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖను వైద్యం, ఆరోగ్య విభాగాలను వేర్వేరుగా అమలు చేయాల్సిన అవసరం ఉందని సీపీఐ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.
మరిన్ని వార్తలు