ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

25 Mar, 2015 08:01 IST|Sakshi

హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కంపు మొదలైంది. తెలంగాణలోని రెండు పట్టభద్రుల స్థానాలకు, ఏపీలోని రెండు ఉపాధ్యాయ స్థానాలకు బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.  లెక్కింపు ప్రక్రియకు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు ముగ్గురు  చొప్పున 42 మంది కౌంటింగ్ సిబ్బందితోపాటు ప్రతి టేబుల్‌కూ ఒక కౌంటిం గ్ సూపర్‌వైజర్‌ను నియమించారు. అలాగే సబ్‌కలెక్టర్, ఆర్డీఓ స్థాయి అధికారులను కౌంటింగ్ టేబుళ్ల వద్ద పర్యవేక్షణకు నియమించారు.


*హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానానికి ...హైదరాబాద్ చాదర్ఘాట్ విక్టోరియా ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ జరుగుతోంది. ఈ స్థానానికి ఎమ్మెల్సీ బరిలో 31మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 39శాతం ఓట్లు పోల్ అయ్యాయి.
* వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానానికి ...నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ మొదలైంది. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ బరిలో 22మంది అభ్యర్థులు ఉండగా, 51 శాతం ఓట్లు పోల్ అయ్యాయి.

*ఇక ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 15మంది అభ్యర్థులు ఉండగా, 83 శాతం ఓట్లు పోల్ అయ్యాయి.
*కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గుంటూరు సెయింట్ జోసెఫ్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతోంది. ఎమ్మెల్సీ బరిలో ఆరుగురు అభ్యర్థులు పోటీ చేయగా 70శాతం ఓట్లు పోల్ అయ్యాయి.

లెక్కింపు ప్రక్రియ ఇలా
ఉదయం 7.50 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ను పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో తెరుస్తారు.కౌంటింగ్ హాలులో ఏర్పాటు చేసిన 14 టేబుళ్లపై ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు.

మరిన్ని వార్తలు