చంద్రబాబుతో రిటైల్ వ్యాపార సంస్థల ప్రతినిధుల భేటీ

2 Jan, 2015 13:45 IST|Sakshi

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో శుక్రవారం రిటైల్ వ్యాపార సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు. ఏపీలో రిటైల్ వ్యాపార సంస్థల ఏర్పాటు అంశంపై వారు సీఎంతో చర్చించారు.  చంద్రబాబు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ ఇవ్వాలని రిటైలర్లను కోరారు. అలాగే యువతీ, యువకులకు రిటైల్ రంగంలో శిక్షణ కోసం నైపుణ్యాల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు సహకారం అందించనున్నాయి.  కాగా ఈ సమావేశంలో వాల్మార్ట్, రిలయన్స్, ఐటీసీతో పాటు పలు రిటైల్ వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు