మొబైల్ స్పీడ్ బ్రేకర్లు

11 Jun, 2014 00:37 IST|Sakshi
మొబైల్ స్పీడ్ బ్రేకర్లు

 కాకినాడ క్రైం : కాకినాడ నగరంలో రహదారులపై పశువుల సంచారం ఎక్కువై వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో నగర రహదారులపై సంచరించే పశువులను నగర పాలక సంస్థ అధికారులు అదుపులోకి తీసుకుని యజమాని నుంచి అపరాధ రుసుం వసూలు చేసేవారు. అప్పట్లో వారు అదుపులోకి తీసుకున్న పశువులకు సరైన ఆలనాపాలనా లేక మృత్యువాత పడ్డాయి. దీంతో జంతుహింస నివారణ సంఘం ఆ విధానాన్ని వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్, అధికారులు, పోలీసులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నగరంలోని జిల్లా పరిషత్, దేవాలయం వీధి, ఇంద్రపాలెం వంతెన, బాలాజీ చెరువు వంటి ప్రధాన సెంటర్లలో పశువులు సంచరించడం ప్రమాదాలకు కారణమవుతోంది. అధికారులు ఈ సమస్యను పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు