ఎస్‌ఎంఎస్ కొట్టు.. టికెట్ పట్టు

24 Aug, 2013 03:36 IST|Sakshi

 భువనగిరి, న్యూస్‌లైన్: రైలు ప్రయాణం మరింత సులభతరమవుతోంది. టికెట్ రిజర్వేషన్ చేయించుకునేందుకు ఇప్పుడు స్టేషన్ దాకా వెళ్లాల్సిన పనిలేదు. ఎంచక్కా ఇంట్లో కూర్చొని మొబైల్ ఎంస్‌ఎంస్‌తో రిజర్వేషన్ చేయించుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఇంటర్నెట్ సేవలు విస్తృతమౌతున్న తరుణంలో ఒక్కో సేవ ఇంట్లోంచే పొందే అవకాశా న్ని సమాచార విప్లవం కల్పిస్తోంది. తాజాగా రైల్వే రిజర్వేషన్లను మొబైల్ ద్వారా పొందే సౌకర్యాన్ని రైల్వే శాఖ పెలైట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టింది.
 
  నిత్యం బీజిగా ఉండి సమయానికి ప్రాధాన్యతనిచ్చే వర్గాల వారు రైల్వేస్టేష న్‌కు వెళ్లి రిజర్వేషన్ టికెట్ కోసం గంటల తరబడి నిలబడకుండా మొబైల్ ద్వారా క్షణాల్లో రైల్వే బుకింగ్ సదుపాయాన్ని పొందే వీలు చిక్కింది. రైల్వే రిజర్వేషన్ కోసం చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో ఎక్కడి నుంచైనా ఉచిత రైల్వే రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం పొందవచ్చు. కేవలం నెట్ బ్యాంకింగ్ ఉంటే చాలు. టికెట్ ప్రింట్ కూడా అవసరం లేదు. మొబైల్‌లో నిక్షిప్తమయ్యే సమాచారంతోనే రైల్వేశాఖ ప్రవేశపెట్టిన ఎస్‌ఎంఎస్ టికెట్ బుకింగ్ సదుపాయం ప్రయాణికులకు ఇప్పుడిప్పుడే చేరువవుతోంది. జూలై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్ ఇప్పుడిప్పుడే ప్రయాణికులకు చేరుతోంది. దీనిపై గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇంకా ప్రచారం జరగాల్సి ఉంది. అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్న ఈ నూతన విధానంతో సమయం ఆదా అవుతుం దని ప్రజల నుంచి అభిప్రా యం వ్యక్తమవుతోంది.  
 
 ఎవరు కల్పిస్తున్నారంటే..
 ఎస్‌ఎంఎస్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని రైల్వే శాఖ అనుబంధ సంస్థ ఐఆర్‌టీఎస్ అందిస్తోంది. ఐఆర్‌టీఎస్ నిర్వహిస్తోన్న 139 సర్వీస్ ప్రొవైడర్‌తో పాటు ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఫ్రీక్వెన్సీ వీక్లి అనే మరో మూడు సర్వీసు ప్రొవైడర్ల ద్వారా ప్రయాణికులు ఎస్‌ఎంఎస్ టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఐఆర్‌టీఎస్‌లో తమ పేరు, వయస్సు, జెండర్ తదితర వివరాలను ఎస్‌ఎంఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ కనెక్షన్ కలిగిన వినియోగదారులు కొంత మొత్తాన్ని మొబైల్‌లో నిల్వచేసుకొని దాని ద్వారా ఐఆర్‌టీఎస్‌కు డబ్బులు బదిలీ చేసి రిజర్వేషన్ చేసకునే సదుపాయం ఉంటుంది. 26 జాతీయ బ్యాంకుల్లో దేంట్లోనైనా అకౌం ట్ ఉండి నెట్ బ్యాంకింగ్ ఉన్న ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ నుంచి ఐఆర్‌టీఎస్‌కు చెందిన 139 ద్వారా టిక్కెట్  పొందవచ్చు.
 
 రాయితీ టిక్కెట్లకు వ ర్తించదు
 రాయితీలపై ప్రయాణించే వారికి మా త్రం మొబైల్ ఫోన్ ద్వారా రిజర్వేషన్ సదుపాయం లభించదు. ఈ టిక్కెట్లు తీసుకునే వారు నే రుగా రిజర్వేషన్ కేంద్రానికే వెళ్లాల్సిందే. మొబైల్ ఫోన్ ద్వారా అన్ని కేటగిరీల టిక్కెట్లను రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉంది. ప్రస్తుతం తత్కాల్ టిక్కెట్ సదుపాయం అందుబాటులోకి రాలేదు. దక్షిణమధ్య రైల్వేలో రోజూ టిక్కెట్లను ఇంటర్నెట్, జనతా టికెట్ బుకింగ్ కేంద్రాలు, పోస్టాఫీసులు, రైల్వేస్టేషన్లలోని బుకింగ్ కేం ద్రాల ద్వారా విక్రయిస్తున్నారు.
 ఎస్‌ఎంఎస్ చేయాల్సిన నంబర్లు ఇవే..
 54959, 57886, 5676747, 130 నంబర్లకు ఎస్‌ఎంఎస్ చేసి రైల్వే టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు