ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

26 May, 2020 17:15 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాగల 24 గంటలలో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రాన్ని ఆనుకొని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలోని మరికొన్ని ప్రాంతాలకు నైఋతి రుతు పవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి  అక్కడక్కడ  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అదేవిధంగా దక్షిణ కోస్తా ఆంధ్రాలో  మూడు రోజుల్లో కొన్ని చోట్ల  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు  కురిసే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్‌ నుంచి 43 డిగ్రీ సెల్సియస్‌ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో ఈ రోజు, రేపు  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు  కురిసే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్‌ నుంచి 43 డిగ్రీ సెల్సియస్‌ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మరిన్ని వార్తలు