కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు

11 Jul, 2015 09:41 IST|Sakshi

విశాఖపట్నం: తూర్పు మధ్యప్రదేశ్ - ఉత్తరప్రదేశ్ మధ్య వాయుగుండం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. కాగా ఈ వాయుగుండం తెలుగు రాష్ట్రాలపై వాయుగుండ ప్రభావం ఉండదని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని తెలిపారు.

ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తాయని అధికారులు చెప్పారు.

>
మరిన్ని వార్తలు