కడప జైలులో దేశంలోనే తొలిసారిగా..

28 Feb, 2020 15:59 IST|Sakshi

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించిన హోంమంత్రి సుచరిత

సాక్షి, వైస్సార్‌ కడప: రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఉన్నత ఆశయంతో పనిచేస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. జైళ్లలో ఖైదీలకు సన్న బియ్యం కావాలని అడుగుతున్నారని, ఈ విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్తామమని చెప్పారు. కడప కారాగారంలో స్కిల్ డెవవలప్‌మెంట్‌ సెంటర్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు.
(చదవండి : చంద్రబాబు తీరుపై పోలీసుల సంఘం ఆగ్రహం)

డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాస్, కలెక్టర్ హరి కిరణ్, జైళ్ల డీజీ మొహమ్మద్ అషన్ రజా, ఎస్పీ అన్బురాజన్, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తయారుచేసిన వివిధ రకాల వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను హోంమంత్రి పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..

‘4 కోట్ల 70 లక్షల రూపాయలతో మోడ్రన్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ యూనిట్‌కు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇలాంటి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్‌ స్విట్జర్లాండ్‌లో మాత్రమే ఉంది. దేశంలోనే మొదటిసారిగా కడప జైలులో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టాం. జైలులో ఏళ్ల తరబడి శిక్ష అనుభవిస్తూ.. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసే అంశంపై ముఖ్యమంత్రితో చర్చిస్తాం. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు బయటకు వెళ్లిన తరవాత స్కిల్ డెవలప్‌మెంట్‌ ద్వారా ఉన్నత జీవితం గడపాలనేదే ప్రభుత్వ ఉద్దేశం.
(చదవండి: ఇద్దరు కుమార్తెలతో బావిలో దూకి తండ్రి ఆత్మహత్య)

ఖైదీలు తయారు చేస్తున్న వస్తువులు బహిరంగ మార్కెట్‌లోని వస్తువులతో పోటీ పడుతున్నాయి. జైళ్లలో నాణ్యతతో కూడిన వస్తువులు తయారు చేస్తున్నారన్న గుర్తింపు వచ్చింది. కడప జైలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్‌లో క్వాలిటీ పెట్రోల్ లభిస్తోందని చెబుతున్నారు. జైలులో ఇప్పటికే డైరీ యూనిట్, బ్రిక్స్ తయారీ, ఫినాయిల్, సోప్, డిటర్జెంట్స్, బేకరీ ఫుడ్ ఐటమ్స్, టైలరింగ్, అగరబత్తీలు తయారు చేస్తున్నారు’అని హోంమంత్రి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు