సినీ ఫక్కీలో మోసం

16 Dec, 2019 04:37 IST|Sakshi

తక్కువ ధరకు బంగారం ఆశ చూపి రూ.11.60 లక్షలతో పరార్‌   

మంగళగిరి: తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని నమ్మించి సినీ పక్కీలో రూ.11.60 లక్షలు దోచుకెళ్లారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఉదంతం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన గారపాటి కుమార్‌కు మంగళగిరికి చెందిన ప్రవీణ్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. పిల్లల చదువు కోసం హైదరాబాద్‌ వచ్చానని చెప్పి ప్రవీణ్‌.. కుమార్‌తో ఫోన్లో స్నేహం పెంచుకున్నాడు. తక్కువ రేటుకు బంగారం ఇప్పిస్తామని నమ్మబలికాడు. ప్రవీణ్‌ మాటలను నమ్మిన కుమార్‌ ఈ నెల 14వ తేదీ హైదరాబాద్‌ నుంచి మంగళగిరికి వచ్చి చినకాకానిలో ఓ లాడ్జిలో దిగాడు.

ఆదివారం సాయంత్రం కుమార్‌కి ఫోన్‌ చేసిన ప్రవీణ్‌ తమ యజమానితో సహా బంగారం తీసుకుని వస్తున్నామని మండలంలోని ఆత్మకూరు గ్రామ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్దకు రావాలని సూచించాడు. నగదు బ్యాగ్‌తో అక్కడ కుమార్‌ వేచి ఉండగా నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దొంగ బంగారం కొని అమ్ముతున్నారంటూ ఫిర్యాదు అందిందంటూ తనిఖీ చేశారు. నగదు బ్యాగుతో సహా కారులో ఎక్కించుకుని బయలు దేరారు. చినకాకాని గ్రామం వద్దకు వెళ్లిన తర్వాత బ్యాగు, మొబైల్‌ లాక్కుని అతనిని కారు నుంచి దించి పరారయ్యారు. నిందితులలో ఒకరు పోలీస్‌ యూనిఫాంలో ఉండడం గమనార్హం. దీంతో నివ్వెరపోయిన కుమార్‌ ఏపీఎస్పీ బెటాలియన్‌లో పనిచేస్తున్న తన స్నేహితుడి సాయంతో మంగళగిరి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా