15 నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ

8 Nov, 2014 14:44 IST|Sakshi

ఒంగోలు : గ్యాస్‌కు ఆధార్ లింకేజీని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చేయనుంది. ఈ మేరకు చమురు మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపరిచింది. 15వ తేదీ నుంచి డెలివరీ అయ్యే సిలిండర్లకు నగదు బదిలీ పథకం వర్తిస్తుందని శ్రీదేవి ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కోటిరెడ్డి తెలిపారు. అయితే గతంలో గ్యాస్‌కు నగదు బదిలీ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నవారు తాజాగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, మిగిలిన వారు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. తమకు ఒక దరఖాస్తు అందజేయడంతోపాటు బ్యాంకుకు కూడా సంబంధిత సమాచారాన్ని తెలియజేస్తూ ఆధార్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు