అవసరమైతే మరిన్ని కొనుగోలు కేంద్రాలు : మంత్రి మోపిదేవి

24 Nov, 2019 12:10 IST|Sakshi

సాక్షి, కర్నూలు : చంద్రబాబు నాయుడు ఆర్ధిక క్రమశిక్షణ తప్పి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ విమర్శించారు. ఆదివారం జిల్లాలో పర్యటించిన మంత్రి గోపాల మిత్ర, ఇతర శాఖల నిధులను పసుపు కుంకుమకు తరలించారని ఆరోపించారు. నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబు రైతులను నిర్లక్ష్యం చేశాడని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులెదురైనా రైతులకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రైతు పండించిన పంటకు మద్ధతు ధరను అందించాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి ఉన్నారని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పత్తి పంట కొనుగోలుకు ఈ క్రాప్‌ బుకింగ్‌ను ఏర్పాటు చేశామని, ఈ క్రాప్‌ బుకింగ్‌ లేకున్నా పత్తి కొనుగోలు చేస్తామని వెల్లడించారు. అవసరమైతే మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని, రైతులెవరూ కూడా గిట్టుబాటు ధర రావట్లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 

మరిన్ని వార్తలు