పెద్దాస్పత్రుల్లో మృత్యుఘోష

28 May, 2018 10:27 IST|Sakshi
విజయవాడ ప్రభుత్వాస్పత్రి

రాజధానిలో పేదలకు అందని మెరుగైన వైద్యం

ఐదు నెలల్లో 2,501 మంది మృత్యువాత

గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రభుత్వాస్పత్రుల్లోనే అత్యధిక మరణాలు

‘మహాప్రస్థానం’ తాజా నివేదికలో వెల్లడి

రాష్ట్ర రాజధానిలో అనారోగ్యం తాండవిస్తోంది. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వ పెద్దల హామీలు వట్టిమాటలుగానే మిగులుతున్నాయి. ముఖ్యంగా పేదలకు వరప్రదాయినులైన ప్రభుత్వాస్పత్రుల్లో మరణ మృదంగం మోగుతోంది. వివిధ రకాల వ్యాధులతో రోజుకు సగటున 18 మంది మృత్యువాత పడుతున్నారని మహాప్రస్థానం వాహనాలు అందించిన నివేదిక.. ఆందోళన కల్గిస్తోంది. కేవలం ప్రభుత్వాస్పత్రుల్లోనే ఐదు నెలల్లో 2,501 మంది చనిపోవడం కలవరపాటుకు గురిచేస్తోంది.

సాక్షి, అమరావతి బ్యూరో:  రాజధాని ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రధాన ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన అందించడంలో ప్రభుత్వ వైఫల్యం కన్పిస్తుంది. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.. సరైన వసతులు, సౌకర్యాలు లేక అత్యవరసర సేవలు అందటం లేదు. ఫలితంగా పేదలు మృత్యువాత పడుతున్నారు. విజయవాడలో 750 పడకల ఆస్పత్రి ఉంది. నూతన శానిటేషన్‌ విభాగం కోసం 1,020 పడకల ఆస్పత్రిగా గతంలో అప్‌ గ్రేడ్‌ చేశారు.

అయితే అందుకు తగిన సౌకర్యాలు మాత్రం కల్పించలేదు. ఆస్పత్రిలో నామమాత్రపు వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. పలు వ్యాధులకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణులు లేరు. గత పదిహేను ఏళ్లుగా గుండె వ్యాధి నిపుణులు( కార్డియాలజిస్ట్‌)లేరు. అత్యవసర వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు పంపిస్తున్నారు. ఎమ్మార్‌ స్కాన్‌ కూడా అందుబాటులో లేదు. మచిలీపట్నం ప్రధాన ఆస్పత్రిలో కూడా గుండె వ్యాధి నిపుణులు, ఫిజియోథెరిపీ వైద్యులు లేరు. రోగులు వస్తే కేవలం మందుబిల్లలతో పంపిస్తున్నారు. అత్యవసర విభాగంలో వైద్యం అందక పేదలు మృత్యవాత పడుతున్నారు.

గుంటూరులో పరిస్థితి ఇది..
గుంటూరులో 1,177 పడకల  ప్ర«భుత్వాస్పత్రిలో కూడా అసౌకర్యాలే తాండ విస్తున్నాయి.. వెంటిలేటర్లు కొరతతోపాటు ఐసీయూ వార్డులు కూడా తగినన్ని లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఆపరేషన్‌ థియేటర్లు సరిపడా లేవు. రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర వైద్యం అందించే పరిస్థితి లేదు. ప్రత్యేక వైద్యనిపుణులు కొరత వేధిస్తుంది. చిన్నారుల వైద్యానికి తగినంత మంది వైద్యులు లేరు. శ్యాసకోస వ్యాధి బాధితులు అధికంగా వస్తున్నా సరైన వైద్యం అందటం లేదు.

ఐదు నెలల్లో...
రాజధాని ప్రాంతంలో ప్రభుత్వాస్పత్రుల్లో మృత్యు ఘోష పై తాజాగా మహాప్రస్థానం వాహనాల ద్వారా మృతులను తరలించిన నివేదిక ప్రభుత్వానికి అందింది. ప్రభుత్వాస్పత్రిలో మరణాలపై ఇచ్చిన నివేదిక అధికారులకు సైతం కళ్లు చెమర్చాయి.

మరిన్ని వార్తలు