స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు

30 Jan, 2020 03:46 IST|Sakshi

కొత్త పంచాయతీరాజ్‌ చట్టం రూపకల్పనకు ప్రభుత్వం నిర్ణయం

ముసాయిదా చట్టం తయారీలో అధికారుల బృందం

సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు మరిన్ని అధికారాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో అమలవుతున్న 1994 నాటి పంచాయతీరాజ్‌ చట్టం స్థానంలో కొత్త పంచాయతీరాజ్‌ చట్టం రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ నేతృత్వంలో.. తూర్పు గోదావరి జిల్లాలోని పంచాయతీరాజ్‌ శాఖ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్‌ ఆనంద్‌తో పాటు మరో ముగ్గురు అధికారుల బృందం కొత్త చట్టం ముసాయిదా తయారీ పనిలో ఉంది.

ఈ బృందం వివిధ జిల్లాల్లో పనిచేసే పంచాయతీరాజ్‌ శాఖ సీనియర్‌ అధికారులతో కలిసి ఈ నెల 22, 23, 24 తేదీల్లో ముసాయిదా చట్టం రూపకల్పనపై కమిషనర్‌ కార్యాలయంలో వర్క్‌షాప్‌ నిర్వహించింది. 15–20 రోజులలో కొత్త చట్టం ముసాయిదా నివేదికను తయారు చేసి, ప్రభుత్వానికి అందజేయనున్నట్టు బృందంలోని ఒక సభ్యుడు ‘సాక్షి’కి వివరించారు.

మరిన్ని వార్తలు