అమ్మ ఒడికి

11 Jul, 2015 02:49 IST|Sakshi
అమ్మ ఒడికి

అక్కున చేర్చుకున్న అమ్మఒడి ఆశ్రమం
చేయూతనిచ్చిన సబ్ కలెక్టర్
 

మదనపల్లెరూరల్ : అమ్మకు ఆపన్నహస్తం అందిం ది. తాము ఆశ్రమం కల్పిస్తామని చిత్తూరుకు చెందిన అమ్మ ఒడి సంస్థ ముందుకొచ్చింది. మదనపల్లె సబ్‌కలెక్టర్  డాక్టర్ ఏ.మల్లికార్జున సహకారం అందించారు. ‘అమ్మ అనాథయ్యింది’అనే శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ దినపత్రిలో ప్రచురితమైన సంగతి పాఠకులకు విదితమే. దీనిపై చిత్తూరుకు చెందిన అమ్మ ఒడి సంస్థ నిర్వాహకులు నలగాంపల్లె చెరకూరి పద్మనాభనాయుడు, కార్యదర్శి చంద్రశేఖర్, వార్డెన్లు శ్రీమతి, అముజ, ఉచిత అంబులెన్స్ సేవలందించే డ్రైవర్ రమేష్‌లు మదనపల్లె ప్రభుత్వాస్పత్రి క్రానిక్‌వార్డులో ఉన్న లక్ష్మీదేవమ్మకు వద్దకు చేరుకున్నారు.

సబ్‌కలెక్టర్ మల్లికార్జున ,ఆస్పత్రి సూపరింటెండెంట్  ఆంజనేయులు, నర్సింగ్ సిబ్బంది సహకారంతో ఆమెను అంబులెన్స్‌లో అమ్మ ఒడి ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ అవసాన దశలో ఉన్న తల్లిదండ్రులను బిడ్డలు వీధులు పాలు చేస్తే క్రిమినల్ కేసులతో పాటు రూ.10వేలు వసూలు చేసి వారి పోషణకు నెలనెలా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
 

>
మరిన్ని వార్తలు