రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకుల దుర్మరణం

13 Jun, 2014 02:57 IST|Sakshi

బొండపల్లి : అర్ధరాత్రి సమయం.. అప్పటి వరకూ అయిన వారి ఇంట పెళ్లిలో సందడిగా గడిపారు. మనిషికి మనిషి తోడున్నాము కదా అని.. రాత్రయినా తమ ఇళ్లకు వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డారు. తాము వచ్చిన ఆటోలోనే తిరుగు ప్రయూణమయ్యూరు. పెళ్లి ఇంటిని వదిలి.. ఆ ఊరిని దాటి కాస్త సమయమైనా కాలేదు. ఇంతలోనే ఉరుములా వచ్చింది ఎక్కడి నుంచో మాయదారి లారీ. మృత్యువై మీద పడింది. చూస్తుండగానే ఇద్దరి ప్రాణాలను గాలిలో కలిపేసింది. ఈ విషాదకర ఘటన అందరినీ కలిచివేసింది. తీవ్రంగా బాధించింది. ప్రాణాలు పోగొట్టుకున్న ఇద్దరూ తల్లీకొడుకులు.
 
 మృత్యువులోనూ వీడని వారి బంధాన్ని చూసి అక్కడి వారు తల్లడిల్లిపోయూరు. గొట్లాం మధుర గ్రామం జియన్నవలస జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30 సమయంలో(తెల్లవారితే గురువారం) ఆటోను గుర్తు తెలియని లారీ ఢీకొంది. ఈ ఘటనలో తల్లీకొడుకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యూరుు. క్షతగాత్రులను జిల్లా కేంద్రాస్పత్రితోపాటు, విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.  గొట్లాం మధుర గ్రామం జియన్నవలసలో పెళ్లి ఉండడంతో పూసపాటిరేగ మండలం యూతపేటకు చెందిన కొంతమంది అదే మండలానికి చెందిన ఆటోలో బయల్దేరారు.
 
 పెళ్లి చూసుకుని తమ స్వగ్రామానికి రాత్రి 1.30 సమయంలో బయల్దేరారు. గ్రామం నుంచి జాతీయ రహదారిపైకి ఆటో వస్తుండగా.. గుర్తు తెలియని లారీ బలంగా ఢీకొంది. దీంతో ఆటో బోల్తా పడింది. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయూడు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పూసపాటిరేగ మండలం యూతపేటకు చెందిన గొడ్డు సంతోషి(39), ఆమె కుమారుడు అప్పలరాజు(4) తీవ్ర గాయూలపాలై సంఘటన స్థలంలోనే మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన వడ్డి సీతయ్య, వి.అసిరినాయుడు, రీసు గౌరి, చందు, పి.రాజమ్మ, జి.గౌరి తీవ్ర గాయూలపాలయ్యూరు.
 

మరిన్ని వార్తలు