సెక్యురిటీ, హెచ్చరిక బోర్డులని ఎందుకు ఏర్పాటు చేయలేదు?

23 Jun, 2018 21:54 IST|Sakshi

సాక్షి​, విజయవాడ : సంగమం ఘాట్‌ వద్ద నలుగురు బీటెక్‌ విద్యార్థులు గల్లంతైన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఆ నలుగురు విద్యార్థుల్లో ఒకరైన ప్రవీణ్‌ (18) తల్లి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడ నలుగురు కానిస్టేబుళ్లను సెక్యురిటీగా పెడితే మా బాబు బతికే వాడని, ఘాట్‌ వద్ద సెక్యురిటీ, హెచ్చరిక బోర్డులని ఎందుకు ఏర్పాటు చేయలేదని పోలీసులను నిలదీశారు. ఏ ముహుర్తాన సంగమం ఘాట్‌ ఏర్పాటు చేశారో కానీ ఎంతో మంది బలైపోతున్నారని వాపోయారు. ఘటన జరిగిన తరువాత కాలేజీ యాజమాన్యం కూడా మాకు సమాచారం ఇవ్వలేదనీ, ఈ దుర్ఘటనకు కాలేజీ యాజమాన్యంతో పాటు, ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. గతంలో పడవ ప్రమాదం జరిగి 22మంది చనిపోయినా ప్రభుత్వం ఘాట్‌ వద్ద సెక్యురిటీని ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. 

 

మరిన్ని వార్తలు