కొడుకులే కాలయములై..

18 Aug, 2014 00:53 IST|Sakshi
కొడుకులే కాలయములై..

మద్యం మత్తు మానవత్వాన్ని మంటగలిపింది.అనుబంధం.. ఆత్మీయతలనే కాదు.. పేగుబంధాల్ని సైతం తెంపేసింది. కొడుకు కఠినాత్ముడైనా.. ఇద్దరు భార్యలూ అతన్ని వదిలేసినా.. మమకారాన్ని చంపుకోలేక అతడి ఆలనాపాలనా చూస్తూ వేళకు అన్నం పెడుతున్న తల్లిని కొడుకే పొట్టనపెట్టుకున్నాడు. మరో ఘటనలో తాగి వచ్చాడన్న కారణంగా తండ్రిని కన్నకొడుకు కర్రతో కొట్టి చంపేశాడు. వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ రెండు ఘటనలు మనసున్న ప్రతివారిని కంటతడి పెట్టించాయి.
 
 ఆరవలిల(అత్తిలి) : మద్యం తాగొచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నాడన్న కారణంతో కన్న తండ్రిని తనయుడే కర్రతో కొట్టి చంపిన ఘటన అత్తిలి మండలం ఆరవల్లిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్సై వి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ఆరవల్లి ఎస్సీ కాలనీకి చెందిన మేడిద కాంతారావు (46) రోజూ తాగివచ్చి తరచూ కుటుంబ సభ్యులతో ఘర్షణ పడుతుంటాడు. ఎప్పటిలా శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన కాంతారావు తన రెండో కుమారుడైన నాగబాబు(20)తో గొడవ పడ్డాడు.
 
 ఓ దశలో కత్తితో కుమారుడిపై దాడి చేశాడు. దీంతో నాగబాబు కత్తులకు పదునుపెట్టే కర్రతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన కాంతారావు అక్కడికక్కడే మృతి చెందాడు. కాంతారావు కొబ్బరి కాయలు దింపు, ఒలుపు పనులకు వెళుతుండగా, కుమారుడు వ్యవసాయ పనులకు వెళుతుంటాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హతుని భార్య కాంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై చెప్పారు.
 
 దొండపూడి (గోపాలపురం) :కన్నతల్లిని అతికిరాతకంగా చంపిన తనయుడి ఉదంతమిది. గోపాలపురం మండలం దొండపూడిలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలవరం సీఐ జీఆర్‌ఆర్ మోహన్ తెలిపిన వివరాలిలా ఉన్నారుు. దొండపూడికి చెందిన దోలి వీర్రాజుకు రెండు వివాహాలయ్యూరుు. మొదటి భార్యకు ఇద్దరు, రెండో భార్యకు ఇద్దరు సంతానం. అతడి దుందుడుకు వైఖరిని తట్టుకోలేక వారిద్దరూ అతన్ని వదిలేసి పిల్లలలో వేర్వేరుగా బతుకుతున్నారు. వీర్రాజు దొండపూడి గ్రామంలో సిమెంట్ వరలు, దిమ్మెలు తయూరు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అతన్ని పట్టించుకునేవారు లేకపోవడంతో తల్లి సుబ్బలక్ష్మి (60) బాగోగులు చూస్తోంది.
 
 వేరే ఇంట్లో తన బతుకు తాను బతుకుతున్న సుబ్బలక్ష్మి రోజూ వంటచేసి మధ్యాహ్నం, సాయంత్రం క్యారేజీలో భోజనం తీసుకెళ్లి కుమారుడికి పెడుతోంది. మద్యానికి బానిసైన వీర్రాజు తరచూ ఆమెనూ దూషిస్తూ, చీటికిమాటికీ విరుచుకుపడుతుండేవాడు. ఇదిలావుండగా, సుబ్బలక్ష్మి పెద్దకుమారుడు, వీర్రాజుకు అన్న అరుున వెంకటేశు కుమార్తెకు ఈనెల 15న వివాహమైంది. అన్నదమ్ములిద్దరికీ మాటలు లేకపోవడంతో అన్న కుమార్తె వివాహానికి వెళ్లొద్దని తల్లి సుబ్బలక్ష్మికి వీర్రాజు హుకుం జారీ చేశాడు. అతడి స్వభావం గురించి తెలిసిన తల్లి సుబ్బలక్ష్మి ఆ మాటలను పట్టించుకోకుండా మనుమరాలి పెళ్లికి వెళ్లింది.
 
 శనివారం రాత్రి ఎప్పటిలా వీర్రాజుకు భోజనం తీసుకెళ్లింది. తాగిన మైకంలో ఉన్న వీర్రాజు ఆ పెళ్లికి ఎందుకు వెళ్లావంటూ ఒక్క ఉదుటున తల్లిపై విరుచుకుపడ్డాడు. తల్లి జట్టుపట్టుకుని ఆమె తలను సిమెంట్ అరుగుకు వేసి పదేపదే బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై వీఆర్వో వి.వల్లభాచార్యులు  ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు సీఐ చెప్పారు. నిందితుడు వీర్రాజును ఎస్సై డి.హరికృష్ణ అదుపులోకి తీసుకున్నారు.
 

మరిన్ని వార్తలు