అమ్మా.. నేను క్షేమం!

15 Aug, 2018 13:21 IST|Sakshi
పసికందును కనుగొన్న శ్రీరంగాపురం రవి, హైవే పోలీసులు సాయి కిరణ్, రామయ్య

అమ్మా..నేనేమి నేరం చేశాను. వెచ్చని నీ పొత్తిళ్లలో హాయిగా నిద్రపోదామంటే విసిరిపారేశావేం?. నన్ను లోకానికి చూపించడానికి భయపడ్డావా? పోషించడం భారమనుకున్నావా? ఎందుకిలా చేశావమ్మా.. అయినా నేను ఏమైపోయానోనని బాధ పడుతున్నావా? ఆ దేవుడి దయవల్ల క్షేమంగా ఉన్నా. కాకాపోతే నీ చనుబాలు తీపి రుచి చూడాలని ఉంది. వెల్దుర్తి మండల పరిధిలోని రైల్వే స్టేషన్‌ ఎదురుగా ముళ్ల పొదల్లో దొరికిన ఓ చిన్నారి ఏడుపు చూస్తే ఇలాగే ప్రశ్నించినట్లుంది.

కర్నూలు, వెల్దుర్తి: రైల్వేస్టేషన్‌ ఎదురుగా ముళ్లపొదల్లో రోజులు నిండని ఓ పసికందు లభ్యమయ్యాడు. శ్రీరంగాపురం గ్రామానికి చెందిన ఎర్రమల అనే వ్యక్తి అటుగా వెళ్తూ కాలకృత్యాల నిమిత్తం బైక్‌ను ఆపగా ఏడుపులు వినిపించడంతో బాబును గమనించి విలేకరులకు సమాచారం అందించాడు. విలేకరులతో పాటు అదే సమయంలో అటుగా వెళ్తున్న హైవే పోలీసులకు చిన్నారిని అప్పగించాడు. వారు స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. బరువు తక్కువగా ఉండడంతో డోన్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు 108లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.    

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

303వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

ఏపీకి హైకోర్టు అవసరం లేదని జీవో తెస్తారేమో: వైఎస్‌ జగన్‌

‘కట్టే కాలేవరకు వైఎస్సార్‌ సీపీలోనే’

‘సీబీఐ అంటే వణుకుతున్న చంద్రబాబు’

‘నిప్పు అయితే విచారణ జరిపించుకో’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వివాదంలో దీప్‌వీర్‌ల వివాహం

రజనీ బ్లాక్‌బస్టర్‌ మూవీ.. అక్కడ మళ్లీ రిలీజ్‌!

ఎట్టకేలకు అక్షయ్‌ సినిమా పూర్తైయింది!

త్రివిక్రమ్ చేతుల మీదుగా ‘శుభలేఖ+లు’

‘రంగస్థలం’ రికార్డ్‌ బ్రేక్‌ చేసిన ‘సర్కార్‌’

రైతుల అప్పులు తీర్చనున్న బిగ్‌బీ