పుస్తకాలు, పెన్సిల్స్‌ దొంగిలిస్తున్నాడని..

25 Jul, 2019 09:06 IST|Sakshi
వరుణ్‌కుమార్‌ తొడపై  వాతలు.. గాయత్రికి కాలిపైన వాతలు పెట్టిన దృశ్యం  

పిల్లలపై తల్లి కర్కశత్వం .. అట్లకాడతో వాతలు

తమ్ముడు తప్పు చేస్తే.. అక్కకూ శిక్ష

అల్లిపురం (విశాఖ దక్షిణం): పిల్లలు తప్పు చేస్తే నయానో, భయానో దారికి తెచ్చుకోవాల్సిన తల్లి కర్కశంగా వ్యవహరించి వాతలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కేజీహెచ్‌లోని వన్‌ స్టాప్‌ సెంటర్‌ సిబ్బందికి విషయం తెలియటంతో తల్లికి కౌన్సెలింగ్‌ ఇచ్చి, ప్లిలలకు వైద్యం అందజేస్తున్నారు. వన్‌ స్టాప్‌ సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం చినముషిడివాడ హైస్కూలులో గాయత్రి 4వ తరగతి, వరుణ్‌కుమార్‌ 3వ తరగతి చదువుతున్నారు. వరుణ్‌కుమార్‌ తోటి పిల్లల పుస్తకాలు, పెన్సిల్స్‌ దొంగిలిస్తున్నాడని పాఠశాల ఉపాధ్యాయుడు, విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో అతని తల్లి అట్లకాడతో వాతలు పెట్టింది.

తమ్ముడు తప్పు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావని గాయత్రికి కూడా కాళ్లపై వాతలు పెట్టింది. విషయం తెలుసుకున్న వన్‌ స్టాప్‌ సెంటర్‌ సిబ్బంది పిల్లలను పరామర్శించేందుకు బుధవారం స్కూల్‌కు వెళ్లారు. వారు స్కూలుకు రాలేదని టీచర్‌ చెప్పడంతో ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి తల్లిని, పిల్లలను కేజీహెచ్‌లోని వన్‌ స్టాప్‌ సెంటర్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పిల్లలిద్దరికీ పారా మెడికల్‌ వార్డులో వైద్యం అందించారు. స్కిన్‌ డాక్టర్‌ సూచన మేరకు పిల్లల వార్డులో చేర్పించి వైద్యం అందజేస్తున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆడపిల్లల్ని వేదిస్తే తాట తీస్తారు!

‘దర్జా’గా బతికేద్దాం

కీర్తి ఘనం.. వసతులు శూన్యం!

మూలకు నెట్టేసి.. భ్రష్టు పట్టించేసి..

ఎస్‌ఐ విద్యార్థిని కొట్టడంతో..

టీడీపీ నాయకుని భూ కబ్జాపై విచారణ

కాలువను మింగేసిన కరకట్ట!

బ్రేకింగ్‌ : జసిత్‌ను వదిలిపెట్టిన కిడ్నాపర్లు..!

ప్రపంచ బ్యాంకులో భాగమే ఏఐఐబీ రుణం 

జసిత్‌ కోసం ముమ్మర గాలింపు

‘పోలవరం’లో నొక్కేసింది రూ.3,128.31 కోట్లు 

కీలక బిల్లులపై చర్చకు దూరంగా టీడీపీ

కౌలు రైతులకూ ‘భరోసా’

రైతన్న మేలు కోరే ప్రభుత్వమిది

సామాజిక అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం

రోజూ ఇదే రాద్ధాంతం

పరిశ్రమలు తెస్తాం.. ఉద్యోగాలు ఇస్తాం

ఏపీలో నవ చరిత్రకు శ్రీకారం

గవర్నర్‌గా విశ్వభూషణ్‌ ప్రమాణ స్వీకారం

సభను అడ్డుకుంటే ఊరుకోం: అంబటి

ప్రవాసాంధ్రుల సభలో వైఎస్ జగన్ ప్రసంగం

ప్రతి జిల్లాలో ప్రత్యేక క్రిమినల్‌ కోర్టు ఏర్పాటు చేయాలి

ఈనాటి ముఖ్యాంశాలు

చంద్రబాబు పాలనలో ఎనీటైమ్‌ మద్యం: రోజా

ఎన్ఎండీసీ నుంచే విశాఖ స్టీల్‌కు ముడి ఖనిజం

అసత్య ప్రచారంపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

మహనీయులు కోరిన సమసమాజం జగన్‌తోనే సాధ్యం

జసిత్‌ నివాసానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ

వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు సంతానంపై ఫిర్యాదు

అక్కడ కూర్చుని హోమ్‌ వర్క్‌ చేసుకునేదాన్ని

విమర్శ మంచే చేసిందన్నమాట..

విజయ్‌ @ 800

ఆపరేషన్‌ సక్సెస్‌

వందలో ఒక్కరు!