తల్లిపాలు అమృతం

1 Aug, 2014 02:42 IST|Sakshi
తల్లిపాలు అమృతం

 బిడ్డకు పాలివ్వడం వల్ల బాలింతల్లో రక్తస్రావ ప్రమాదం తగ్గడంతో పాటు త్వరగా కోలుకుంటారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు.ఊబకాయం రాదు. గర్భానికి పూర్వం ఉన్న బరువును తిరిగి పొందుతారు. బిడ్డకు పాలు పట్టించడం వల్ల రొమ్ము, గర్భ సంచి క్యాన్సర్లు రావు.తల్లులకు మలి వయసులో వచ్చే అస్టియేపొరోసిస్(ఎముకల బలహీనత) నుంచి బయటపడుతారు.  తల్లి, శిశువుల మధ్య బంధాన్ని పెంపొందిస్తుంది.  ఆరు నెలల వరకు బిడ్డకు తప్పని సరిగా రోజుకు 8 నుంచి 10 సార్లు పాలు ఇవ్వాలి.
  తల్లికి, శిశువుకు జ్వరం వచ్చినప్పుడు, టీకాలు వేసినప్పుడు కూడా పాలు పెట్టొచ్చు.
 
 శ్రీకాకుళం రూరల్/పాలకొండ: తల్లి పాలు పిల్లలకు అమృతంలో సమానం. శిశువు సంపూర్ణ ఆరోగ్యానికి దివ్య ఔషధం. తల్లిపాలలో ఉన్న రోగనిరోధక శక్తి ఎందులోనూ ఉండదని వైద్యనిపుణుల భావన. తల్లిపాలు సమృద్ధిగా లభించే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఎదుగుతారు. అయితే, ప్రస్తుత ఆధునిక పోకడలతో చాలా మంది తల్లులు పిల్లలకు పాలివ్వడం నామోషీగా భావిస్తున్నారు. ఇలాంటి వారికి తల్లిపాలు విశిష్టతను తెలియజేయడం... తల్లిపాలను బిడ్డకు ఎంత వయసు వచ్చే వరకు ఇవ్వాలి.. రోజుకు ఎన్ని సార్లు పట్టాలి.. తల్లిపాలు పుష్కలంగా పిల్లలకు అందాలంటే తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..
 
 తదితర అంశాలపై గ్రామీణ, పట్టణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి ఏడో తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించనున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల్లో నాలుగు రోజుల పాటు ఆరోగ్యశాఖ అనుబంధంతో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. తల్లిపాలు శ్రేష్టమైనవని, ప్రతి ఒక్క బాలింత బిడ్డలకు పాలిచ్చి పిల్లలను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని వైద్యులు సూచి స్తున్నారు. తల్లిపాల నుంచి పిల్లలకు లభించే పోషకాలను చూస్తే...
 
  బిడ్డ పుట్టిన మొదటి అరగంట లోపు పిల్లలకు పాలివ్వడం మం చిది. ఇందులో మాంసకృత్తులు, విటమిన్ ఏ ఉంటాయి. రోగ నిరోధక శక్తి లభిస్తుంది. ముర్రుపాలు బిడ్డను జీవితకాలం కాపాడతాయి.  శిశువు పేగులను శుభ్రం చేసి, మొదటి మల విసర్జనకు తోడ్పడతాయి.  తల్లులు సహజంగా బిడ్డకు సరిపడా పాలు రావడం లేదని అనుకోవడం అపోహా మాత్రమే. బిడ్డ పుట్టగానే పాలు మూడు, నాలుగు రోజుల వరకు పడవని తేనె నాకించడం, పంచధార, గ్లూకోజ్ నీళ్లు ఇవ్వరాదు.  తల్లిపాలే శిశువుకు సంపూర్ణమైన సమతుల ఆహారం.
 
  నాణ్యమైన ప్రోటీన్లు లభిస్తాయి. బిడ్డ మెదడుకు వికాసానికి తోడ్పడతాయి. ఇందులోని లాక్టోజ్ వల్ల కాల్షియం నిల్వలు పెరుగుతాయి.బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి. తొలి నెలలో శిశువులకు వివిధ రకాల అంటువ్యాధుల భారినుంచి కాపాడతాయి. బిడ్డ మనోవికాశానికి దోహదపడతాయి. జీర్ణ మండలాన్ని వృద్ధి చేస్తాయి.
 
  తల్లిపాల ద్వారా బిడ్డలకు డయోరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధులు దరిచేరవు. క్యాన్సర్, చెవికి సంబంధించిన వ్యాధులు, గుండె జబ్బులు వంటి వ్యాధులభారి నుంచి రక్షణ కల్పిస్తాయి.   ఎలర్జీ, ఆస్తమా, డయాబెటీస్ వంటి వ్యాధులు రావు.  బాల్యంలో, యవ్వనంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువ.
 
 తల్లిపాలు పుష్కలంగా రావాలంటే..
  గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. పాలు, చేపలు, గుడ్లు, వెల్లుల్లిపాయ, తాజా కూరగాయలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి. ఆహారంలో తీపి పదార్థాలు (స్వీట్లుకాదు) అంటే ప్రకృతి సహజంగా దొరికే పం డ్లు కడిగిన తర్వాత తినాలి.
 
 ఫ్యాషన్ పోకడలు వీడాలి
 నరసన్నపేట: అమ్మప్రేమ కన్నా మించినది లేదు. తల్లిపాలకు మించిన పోషక పదార్థం సృష్టిలో మరొకటి లేదు. అరుుతే, ప్రస్తుత పాశ్యాత్య సంస్కృతి, ఫ్యాషన్ ప్రపంచంలో అందం కాపాడుకునేందుకు, పిల్లలకు పాలిచ్చేం దుకు కూడా వెనుకంజవేసే తల్లులు ఎక్కువవుతున్నారని, ఇది సమాజ శ్రేయస్సుకు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాతృప్రేమ మాధుర్యాన్ని వదులుకోవడం ఆందోళనకర విషయంగా పేర్కొన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో  రెడీమేడ్ దుస్తులు మాదిరిగా మార్కెట్లో బిడ్డలను అమ్మేవారు ఉంటే కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్న మహిళలు కళ్లెదుటే కనిపిస్తుండడం, చివరికి వృద్ధాప్యంలో పోషణకు పనికి వచ్చే పరికరాలుగా బిడ్డలను ఉపయోగించుకునే సంస్కృతి కూడా మరికొద్ది రోజులకి వస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  ఈ తరుణంలో తల్లిపాత్ర, మాతృత్వంలో అనుభూతి , మానవత్వం విలువలు సమాజానికి తెలియజేయాల్సిన అవసరం స్వచ్ఛంద సంస్థలకు, మహిళా శిశుసంక్షేమ శాఖకు ఉంది.
 
 సెట్‌టాప్ విధానం అంటే...
 కేబుల్ టీవీ కనెక్షన్ ద్వారా ఎనలాగ్ సిగ్నల్స్‌తో టీవీ చానల్స్‌ను వీక్షించిన మనకు పదో, పన్నెండో చానల్స్ తప్ప మిగిలిన దాదాపు అన్ని చానల్స్ చుక్కలుచుక్కలతో ప్రసారాలు జరగుతున్నాయి. అలా కాకుండా ఈసెట్ టాప్ బాక్సుల ఏర్పాటుతో పూర్తిస్థాయి డిజిటల్ సిగ్నల్స్‌తో హెచ్‌డీ నాణ్యత (హాత్‌వే డిజిటల్ క్వాలిటీ)తో ప్రసారాలకు అవకాశముంటుంది. మనం కోరుకునే చానల్స్‌ను ఒక ప్యాకేజీగా చూసుకునే అవకాశముంది. అనవసర చానల్స్‌ను వద్దనుకునే సౌకర్యం కూడా ఉంది. కేవలం 500 మెగా హెడ్జ్ పౌనఃపుణ్యంతోనే సుమారు 300 నుంచి 400 చానల్స్‌ను అదే క్వాలిటీతో చూడవచ్చు. అదే ఎనలాగ్ ప్రసారాలతో పోల్చితే సుమారు 360 మెగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీ తక్కువతోనే సెట్ టాప్ బాక్సులతో క్వాలిటీ దృశ్యం సాధ్యపడుతుంది.
 
 వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ
 తల్లిపాల లో అధిక వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. బిడ్డ పుట్టిన అరగంట నుంచే తల్లిపాలు తాగించడం నేర్పాలి. మొదటి మూడు రోజుల  పాలు ఎంతో ప్రయోజనమైనవి. ఆరు నెలల వరకు పాలు పట్టించాలి. తల్లిపాలు పట్టించడం వల్ల పిల్లలకు సరిపడిన పాలు ఉత్పత్తి అవుతాయి. పిల్లలకు అవసరమయ్యే ప్రొటీన్లు, మాంసకృత్తులు, కాల్షియం, కొవ్వు పదార్థాలు, ఐరన్ వంటివి తల్లిపాలలో లభ్యమవుతాయి.
 -డాక్టర్ రౌతు భారతి,
  స్త్రీ వైద్య నిపుణురాలు, పాలకొండ
 

మరిన్ని వార్తలు