నా ప్రాణం పోయినా బాగుండేది : మోత్కుపల్లి 

11 Jul, 2018 20:34 IST|Sakshi
కాలిబాటలో పాదయాత్రగా బయలు దేరిన మోత్కుపల్లి నరసింహులు

సాక్షి, తిరుమల : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న మాటలకు తన ప్రాణం పోయినా బాగుండేదని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి ఆయన కాలిబాటలో పాదయాత్రగా బయలు దేరారు. కొద్దిసేపటి తర్వాత కాలిబాటలో ఆయన స్వల్ప అస్వస్థకు గురయ్యారు. వైద్య పరీక్షల అనంతరం కోలుకున్న ఆయన పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనను అవమాన పరిచారని, ప్రజల ముందు అవహేళన చేశారని వాపోయారు.

దళితులకు సేవ చేయటానికే తప్ప.. తనకు వేరే ఆలోచన లేదని మోత్కుపల్లి తెలిపారు. కానీ చంద్రబాబు కులాన్ని అడ్డుపెట్టుకుని దూషించారని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన దానికి దేవుని వద్ద తన గోడును వినిపించుకుంటానని అన్నారు. తాను ఏ పార్టీలోనూ చేరాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కాలిబాటలో అనారోగ్యానికి గురై బీపీ పెరిగి.. గుండె నొప్పిగా ఉన్న పాదయాత్ర ఆపలేదని మోత్కుపల్లి నరసింహులు తెలిపారు. 

మరిన్ని వార్తలు