ఇద్దరు ఎర్రదొంగలు కడప జైలుకు తరలింపు

6 Jul, 2015 01:46 IST|Sakshi

చిత్తూరు (అర్బన్) : ఇద్దరు బడా ఎర్రచందనం స్మగ్లర్లను ఆదివారం రాత్రి వైఎస్సార్ కడప కేంద్ర కారాగారానికి తరలించారు. తమిళనాడుకు చెందిన   ఎర్రచందనం స్మగ్లర్లు రాజేంద్రన్ సెల్వరాజ్, కే.మణి  పై ప్రివెంటివ్ డిటెక్టివ్ (పీడీ) యాక్టు నమోదుకు ఆదేశాలు జారీ చేస్తూ కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆదివా రం ఆదేశాలు జారీ చేశారు.  ఇప్పటికే అరెస్టయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వీరిని కలెక్టర్ ఆదేశాల మేరకు జైలుకు పంపారు.

 సెల్వరాజ్ : చెన్నైలోని ఆళ్వార్‌పెట్‌కు చెందిన సదాశివం రాజేంద్రన్ కుమారుడు సెల్వరాజ్ (52) అనే చెల్లా పదోతరగతి వరకు చదువుకున్నాడు. 1993 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా వ్యాపారంలో ఉన్నాడు. ఇతనికి చెన్నై లో ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ గోడౌన్‌ను ఎర్రచందనం అక్రమ రవాణాకు ఉపయోగించేవాడు. ఇతనికి సౌదీఅరేబియా, బర్మా దేశాల్లోని అంతర్జాతీయ స్మగ్లర్లతో సన్నిహిత సంబంధాలున్నాయి. సెల్వరాజ్‌పై గతేడాది కూడా పీడీ యాక్టు నమోదు చేశారు. ఇప్పటివరకు ఇతడు సుమారు 600 టన్నుల ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేశాడు. ఇతనిపై జిల్లాలో 13 కేసులున్నాయి. ఇతని వార్షిక ఆదా యం దాదాపు రూ.50 కోట్లని అంచనా.
 
మణి :  తమిళనాడు రాష్ట్రం నామక్కల్ జిల్లా వెల్లూరుకు చెందిన కర్పన్న గౌండర్ కుమారుడు కే.మణి (50) ఆరో తరగతి వరకు చదువుకున్నాడు. 2006 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నాడు. ఎర్రచందనం అక్రమరవాణాలో పైలటింగ్ చేస్తూ స్మగ్లర్‌గా ఎదిగాడు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాల్లోని స్మగ్లర్లతో పరిచయాలు ఉన్నాయి. ఇప్పటివరకు 100 టన్నులు ఎర్రచందాన్ని అక్రమ రవాణా చేశాడు. జిల్లాలో ఇప్పటివరకు ఇతనపై ఎనిమిది  కేసులున్నాయి. ఇతని నెల సరి ఆదాయం *20 లక్షలు.
 
 

>
మరిన్ని వార్తలు