ఉద్యమానికి అడ్డ సిద్దిపేట గడ్డ

3 Aug, 2013 00:08 IST|Sakshi

సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: తెలంగాణ ఉద్యమానికి, కేసీఆర్ నాయకత్వానికి సిద్దిపేట గడ్డ పునాది వేసిందని టీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత టి.హరీష్‌రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం సిద్దిపేట పట్టణంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ పార్టీలు ఏవైనా.. కండువాలు వేరైనా.. ఎన్నికలొచ్చేసరికి పార్టీలకతీతంగా ఉద్యమానికే ఓట్లేసిన గొప్ప ఆదర్శప్రాయులు ఆయా పార్టీల కార్యకర్తలదని కొనియాడారు. సిద్దిపేటలో దీక్షలు 1,300 రోజులు దాటి సుదీర్ఘకాలంగా కొనసాగడం మామూలు విషయం కాదన్నారు. దీక్షలకు చిహ్నంగా భారీ పైలాన్‌ను నిర్మించుకుందామని ఆయన ప్రకటించారు.
 
 ప్రత్యేక రాష్ట్రం కల మాదిరిగానే సిద్దిపేట జిల్లా స్పప్నం కూడా రానున్న రోజుల్లో నెరవేరుతుందని తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలు సేద్యంలోకి వస్తాయని, పిల్లలకు ఉచి త విద్య ఆంగ్లంలో లభిస్తుందంటూ భావి ప్రణాళికను హరీష్ వెల్లడించారు. గల్ఫ్ దేశాల కు వెళ్లాల్సిన కర్మ తప్పుతుందని తెలిపారు. ఆత్మహత్యలు, ఎన్‌కౌంటర్లు లేని ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతం కానుందని చెప్పారు. అయితే పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఆమోదిం చేంత వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. అప్పుడే కనీవినీ ఎరుగని రీతిలో సిద్దిపేటలో అద్భుతంగా సంబరాలు జరుపుకొందామన్నారు. ప్రత్యేక రాష్ట్రం స్థాపన పరంగా రాజ్యాంగ ప్రక్రియ సాఫీగా సాగాలని కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ ఆకాంక్షించారు. నంది అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణ పోరులో సిద్దిపేట పాత్ర సువర్ణ అక్షరాలతో లిఖించ తగినదంటూ కీర్తించారు.
 
 మార్మోగిన సిద్దిపేట..
 టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ సభ, ర్యాలీతో సిద్దిపేటలో పండుగ వాతావరణం కన్పించింది. మొదట రంగధాం పల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్యే టి.హరీష్‌రావుతోపాటు ప్రముఖ కవి నందిని సిధారెడ్డి, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నాయకులు, జేఏసీ నాయకులు, తెలంగాణవాదులు నివాళులర్పించారు. బాణసంచా కాలుస్తూ నినాదాలు చేస్తూ, పూల వర్షం కురిపిస్తూ హరీష్‌రావును చైతన్య రథం ఎక్కించారు. ఈ ఊరేగింపు పట్టణంలోని పాత బస్టాండ్ వరకు సాగింది. దానిముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మాజీ కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, సాయిరాం, జేఏసీ నేతలు పాపయ్య, తిరుపతిరెడ్డి, గాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్వీ నేతలు వేణుగోపాల్‌రెడ్డి, నయ్యర్‌పటేల్, బి.మల్లేశం, కమలాకర్‌రావు, డి.మల్ల య్య, జాప శ్రీకాంత్, శేషుకుమార్, కరాటే కృష్ణ, గుండు శ్రీనివాస్, నటరాజ్, బాల్‌రెడ్డి, వెంకట్‌గౌడ్, సుమన్‌రెడ్డి, రామన్న, గౌటి మల్లే శం, అశోక్, కాముని నగేశ్, సాకి గాంధీ, బూర విజయ, మంతూరి పద్మ, శైలజ, సువర్ణలక్ష్మి, టైగర్  నర్సమ్మ, నందాదేవి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు