'కర్నూలును రాజధాని చేయకపోతే మరో ఉద్యమం'

3 Mar, 2014 10:22 IST|Sakshi
'కర్నూలును రాజధాని చేయకపోతే మరో ఉద్యమం'

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో సీమాంధ్ర నేతల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తమ ప్రాంతాలను రాజధానిగా చేయాలంటే నాయకులు డిమాండ్ చేస్తున్నారు.  రాజధాని అంశానికి సంబంధించి కేంద్రం ఏ వైపు అడుగులు వేసినా  సీమాంధ్రలో మాత్రం అలజడి మొదలైంది.  తాజాగా కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కాస్త స్వరం పెంచారు. గత ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూల్ ను సీమాంధ్ర రాజధానిగా చేయాలని కోట్ల డిమాండ్ చేస్తున్నారు.

 

కాని పక్షంలో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం మొదలవుతుందని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ను వీడిన వారు వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదన్నారు. పార్టీలు మారే వారిని ప్రజలు ఆదరించరని కోట్ల అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు