ఇడుపులపాయలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన ఎంపీ

2 Oct, 2019 19:14 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షా 27 వేల శాశ్వత ఉద్యోగాలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కల్పించారని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్‌ జిల్లా వేంపల్లి మండలంలోని ఇడుపుల పాయలో గ్రామ సచివాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అవినీతి రహిత పాలన అందించడమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతమన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలంటే గ్రామ స్థాయి ఉద్యోగులు దృఢసంకల్పంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డపేరు తీసుకురావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మాజీ ఎంపీపీ రవికుమార్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ చంద్ర ఓబుల్‌ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా